Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
7540mAh బ్యాటరీతో 'రెడ్‌మీ టర్బో 5' లాంచ్!

7540mAh బ్యాటరీతో 'రెడ్‌మీ టర్బో 5' లాంచ్!

వార్త 2 weeks ago

Redmi Turbo 5 Phones: షియోమీ (Xiaomi) సబ్-బ్రాండ్ రెడ్‌మీ భారత మార్కెట్లోకి సరికొత్త పవర్‌హౌస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 'రెడ్‌మీ టర్బో 5' పేరుతో లాంచ్ అయిన ఈ మొబైల్..

భారీ బ్యాటరీ, అల్ట్రా-ఫాస్ట్ ప్రాసెసర్‌తో మిడ్-ప్రీమియం విభాగంలో కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. ముఖ్యంగా మొబైల్ గేమర్స్, హెవీ మల్టీటాస్కర్స్ మరియు అద్భుతమైన బ్యాటరీ లైఫ్ కోరుకునే వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు.

Read Also :Today Gold Rate: అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరినా తగ్గని బంగారం ధరలు

డిస్‌ప్లే & అదిరిపోయే పర్ఫార్మెన్స్

రెడ్‌మీ టర్బో 5 కేవలం వేగంలోనే కాదు, విజువల్స్ పరంగానూ టాప్ క్లాస్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇందులో 6.59 అంగుళాల 1.5K అమోలెడ్‌ (AMOLED) డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ మరియు గరిష్టంగా 3,500 నిట్స్ (Nits) పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఉంది. ఈ ఫోన్‌లో సరికొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా (MediaTek Dimensity 8500 Ultra) చిప్‌సెట్‌ను అమర్చారు. దీనికి తోడు LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీ ఉండటం వల్ల హై-ఎండ్ గేమింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది. ఫోన్‌ రక్షణ కోసం ఏకంగా IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్స్‌ను ఇచ్చారు. అంటే నీటిలో పడినా, ధూళి చేరినా ఫోన్‌కు ఏమీ కాదు.

లార్జెస్ట్ బ్యాటరీ & కెమెరా సెటప్

రెడ్‌మీ హిస్టరీలోనే మోస్ట్ పవర్‌ఫుల్ బ్యాటరీ సెటప్‌తో ఈ ఫోన్ వచ్చింది. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ కేవలం 8.18mm మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 100W హైపర్‌చార్జ్ (HyperCharge) సపోర్ట్ ఇచ్చారు. కేవలం 30 నిమిషాల్లోనే 51% బ్యాటరీ నిండుతుంది. అలాగే, 27W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రధాన కెమెరా (OIS + EIS సపోర్ట్‌తో) మరియు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఇది 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

Redmi Turbo 5 Phones: ధర, వేరియంట్లు & సేల్ ఆఫర్స్

భారత్‌లో రెడ్‌మీ టర్బో 5 రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. దీనిపై లాంచ్ ఆఫర్ కింద రూ. 2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఆపిల్ లవర్స్‌కు క్రేజీ అప్‌డేట్.. మడతపెట్టే ఐఫోన్, టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha