CM Revanth Reddy: సోషల్ మీడియాలో ప్రస్తుతం జోరుగా సాగుతున్న '80s' ఏఐ ట్రెండ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భాగమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత సాయంతో తనను తాను 1980ల నాటి యువకుడిగా ఊహించుకుంటూ రూపొందించిన ఒక వింటేజ్ ఫొటోను ఆయన తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు.
పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ రెట్రో లుక్ ఫొటో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
Read Also : Secunderabad Madras Regiment: ఆయుధాల చోరీ కేసు.. ముగ్గురు ఆర్మీ అధికారులు అరెస్ట్
CM Revanth Reddy: యమహా ఆర్‌ఎక్స్ 100 బైక్, వింటేజ్ రేడియోతో డాషింగ్ లుక్
ఈ ఏఐ చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంతో డాషింగ్‌గా కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 80ల కాలంలో యువతకు ఐకానిక్‌గా నిలిచిన యమహా ఆర్‌ఎక్స్ 100 బైక్ పక్కన నిల్చుని ఉన్న ఆయన శైలి ప్రత్యేకంగా నిలిచింది. ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా పక్కనే ఒక పాతకాలపు వింటేజ్ రేడియో, ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్ మరియు దుస్తుల శైలిని పొందుపరిచారు. “తాను కూడా 80s ట్రెండ్‌లో జాయిన్ అయ్యానని” రేవంత్ రెడ్డి ఈ ఫొటోకు క్యాప్షన్ జోడించారు.
నెటిజన్లు, అభిమానుల విశేష స్పందన
సీఎం పంచుకున్న ఈ వింటేజ్ అవతారంపై సామాజిక మాధ్యమాల్లో కామెంట్ల వర్షం కురుస్తోంది. 'అన్నా సూపర్', 'టాలీవుడ్ ఓ మంచి హీరోను మిస్ అయింది', 'డాషింగ్ లుక్' అంటూ నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది ఏఐ సాయంతో పాతకాలపు జ్ఞాపకాలను పునఃసృష్టిస్తూ ఈ 80s ట్రెండ్‌ను ఫాలో అవుతుండగా, రాజకీయ నాయకులు కూడా ఇందులో భాగం కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

