Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
81 ఏళ్ల వృద్ధురాలతో ప్రేమలో పడ్డ 24 ఏళ్ల యువకుడు

81 ఏళ్ల వృద్ధురాలతో ప్రేమలో పడ్డ 24 ఏళ్ల యువకుడు

వార్త 1 day ago

Love : ప్రేమకు సరిహద్దులు, వయసుతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించే విచిత్రమైన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఫ్రాన్స్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలు, ఆఫ్రికాకు చెందిన 24 ఏళ్ల యువకుడితో గాఢమైన ప్రేమలో పడింది.

వీరిద్దరి మధ్య ఏకంగా 57 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటం విశేషం. సుమారు రెండేళ్ల క్రితం సోషల్ మీడియా వేదికగా వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా మైత్రిగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. గత రెండేళ్లుగా ప్రతిరోజూ వీడియా కాల్స్, చాటింగ్ ద్వారా సందేశాలు పంపుకుంటూ తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మీయ కలయిక.. ఈ సెప్టెంబర్‌లోనే పెళ్లి!

ఇటీవల ఆ వృద్ధురాలు తన ప్రియుడిని ప్రత్యక్షంగా కలిసేందుకు విమానంలో రాగా, ఎయిర్‌పోర్ట్‌లో వారిద్దరూ ఎదురైన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఒకరినొకరు కౌగిలించుకుని, ముద్దులతో సంతోషాన్ని పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వయసు వ్యత్యాసంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నప్పటికీ, వారు మాత్రం తమ ప్రేమ బంధంపై ధీమాగా ఉన్నారు. రాబోయే సెప్టెంబర్ మాసంలోనే వివాహం చేసుకుని ఒక్కటికాబోతున్నామని ఆ వృద్ధురాలు అధికారికంగా వెల్లడించింది.

సరిహద్దులో చైనా శతఘ్నుల మోహరింపు.. పాకిస్థాన్‌కు భారత్ కఠిన హెచ్చరిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha