Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
9 సిలిండర్ల నుండి 4 కే పరిమితం..ప్రభుత్వం కీలక నిర్ణయం

9 సిలిండర్ల నుండి 4 కే పరిమితం..ప్రభుత్వం కీలక నిర్ణయం

వార్త 5 days ago

LPG Shortage : కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన'. ఈ పథకం ద్వారా ఎంతో మంది మహిళల వంటగది కష్టాలు తీరాయి.

అయితే, తాజాగా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఏడాదికి ఇస్తున్న 9 సబ్సిడీ LPG సిలిండర్ల సంఖ్యను ఏకంగా 4 కి తగ్గించేసింది. దీంతో ఉజ్వల లబ్ధిదారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? సామాన్యులపై దీని ప్రభావం ఎంత ఉంటుంది? గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా! ప్రభుత్వం ఈ సబ్సిడీ కోత పెట్టడానికి ముఖ్య కారణం.. సబ్సిడీ సిలిండర్ల పక్కదారి పట్టడమే . కొంతమంది కేటుగాళ్లు ఉజ్వల యోజన లబ్ధిదారుల పేరుతో తక్కువ ధరకే లభించే సబ్సిడీ LPG సిలిండర్లను బుక్ చేస్తున్నారు.

Read Also: SBI: కేంద్రానికి SBI రూ.8,813 కోట్ల డివిడెండ్

 LPG Shortage

LPG Shortage: లూప్‌హోల్స్ వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి

ఉజ్వల లబ్ధిదారుల పేరిట ఏడాదికి 9 సిలిండర్ల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉండటాన్ని ఈ ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇలా సబ్సిడీ సిస్టమ్‌లో ఉన్న లూప్‌హోల్స్ వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. అందుకే ఈ అక్రమ దందాలకు బ్రేక్ వేయడానికి ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. సగటు వాడకం అంతేనట! ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న ఒక సాధారణ కుటుంబం ఏడాదికి సగటున కేవలం 4 LPG సిలిండర్లను మాత్రమే వాడుతోంది. అంటే నిజమైన లబ్ధిదారులకు ఏడాదికి 4 సిలిండర్లు సరిపోతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

23 పార్టీల భాగస్వామ్యం ..హాజరైన ప్రముఖ నేతలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha