Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ దేశంలో బొజ్జ అబ్బాయిలు అంటేనే అమ్మాయిలకు ఇష్టం!

ఆ దేశంలో బొజ్జ అబ్బాయిలు అంటేనే అమ్మాయిలకు ఇష్టం!

వార్త 2 months ago

ఫిట్‌గా ఉండి సిక్స్ ప్యాక్ ఉంటేనే అమ్మాయిలు చూస్తారని కుర్రాళ్లంతా అనుకుంటారు! అందుకే అమ్మాయిల ముందు తమ పొట్టను దాచేస్తుంటారు.. జిమ్‌లకు వెళ్లి కసరత్తులు చేసి బొర్ర తగ్గించేస్తుంటారు.

కానీ బొర్ర ఉన్నవాడే మగాడు.. సుందరాంగుడు అని అనుకునే ఓ ప్లేస్ ఉందని తెలుసా! ఇథియోపియో(Ethiopia)లోని అడవుల్లో ఉన్న బోడీ తెగవాళ్లు(Bodi Tribe).. ఎంత పెద్ద పొట్ట ఉంటేనే అతడిని అంత హ్యాండ్‌సమ్‌గా చూస్తారంట.. అలాంటి వ్యక్తులను అమ్మాయిలు పోటీపడి మరీ ప్రేమిస్తారట.

Read Also: Iran-USA War: ఇరాన్ యుద్ధం తర్వాత చమురు, గ్యాస్ ధరలు తగ్గవు..ఈయూ హెచ్చరిక

 Belly Man

Belly Man: ఇథియోపియోలోని ఓమో లోయలో నివసించే బోడీ తెగ ఆచారం

ఆఫ్రికా దేశమైన ఇథియోపియోలోని ఓమో లోయలో నివసించే బోడీ తెగ ఆచారం ప్రకారం.. బొద్దుగా, ముందుకు పొడుచుకు వచ్చే పొట్టలతో ఉన్న వారిని శక్తివంతులుగా చూస్తారు. అంతేకాదు పెద్ద పొట్ట ఉన్న వాళ్ల కోసం ప్రత్యేకంగా పోటీలు కూడా పెడతారు. ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే కాయల్ ఉత్సవంలో భాగంగా ఈ పొట్ట పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు.. యువకులు కష్టపడి తమ పొట్టలను పెంచుతుంటారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆరు నెలల ముందు నుంచే కఠోర శ్రమను మొదలుపెడతారు. ఆరు నెలల ముందు నుంచి అన్ని పనులు మానేసి ఇంటికే పరిమితమైపోతారు. అప్పట్నుంచి అధిక కేలరీలు కలిగిన ఆహారాన్ని అధిక మొత్తంలో తీసుకుంటుంటారు. బరువు పెరిగేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన పానీయాలను రోజూ తీసుకుంటారు. శరీరంలో కొవ్వు వేగంగా పెరుగుతుందని ముఖ్యంగా ఆవు పాలు, రక్తం కలిపి మిశ్రమాన్ని ఎక్కువగా సేవిస్తారు. అలా మొత్తానికి తమ పొట్ట బెలూన్ల ఉబ్బిపోయేందుకు ఎంత తినాలో అంత తినేసి.. కాయల్ ఉత్సవానికి రెడీ అవుతుంటారు. ఇలా పొట్ట పెంచేందుకు అబ్బాయిలు కష్టపడుతుంటే.. పొట్టతో ఉన్న అందగాళ్లను చూడాలని అమ్మాయిలు కూడా ఏడాదంతా ఎదురుచూస్తారు. పురుషులకు బాణ పొట్ట అందం అయితే.. అమ్మాయిలకు శరీరంపై గాట్లు, గాయాల గుర్తులను అందానికి ప్రతీకగా చూస్తారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha