మూడు ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దని భారత పౌరులకు హెచ్చరిక
Ebola Virus : ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు అనవసర ప్రయాణాలు చేయొద్దని భారత పౌరులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
ఎబోలా వ్యాప్తితో అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి
కాంగో, ఉగాండా దేశాల్లో 'బుండిబుగ్యో' రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని డబ్ల్యూహెచ్ఓ దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఆఫ్రికా సీడీసీ కూడా ఈ వైరస్ వ్యాప్తిపై హెచ్చరికలు జారీ చేసింది.
వ్యాక్సిన్ లేకపోవడంతో పెరుగుతున్న భయం
బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్‌కు ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ అధిక మరణాల రేటుతో కూడిన ప్రమాదకర వ్యాధిగా గుర్తింపు పొందింది. కాంగో, ఉగాండాతో సరిహద్దులు పంచుకుంటున్న దక్షిణ సూడాన్‌కు కూడా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also : భారత్ కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి
Ebola Virusభారత్‌లో ఇప్పటివరకు కేసులు లేవు
ప్రస్తుతం భారత్‌లో ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ విదేశీ ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే ఆ దేశాల్లో ఉన్న భారతీయులు స్థానిక ఆరోగ్య అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

