Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు

వార్త 3 days ago

Aadhaar free update: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ ఉచిత అప్డేట్ గడువు పెంపు చేసింది. పదేళ్లుగా అప్డేట్ చేసుకోని వారు జూన్ 14 వరకు ఈ సేవలను ఉచితంగా పొందే అవకాశం కల్పించింది.

నివాసితులు తమ గుర్తింపు, చిరునామా పత్రాలను డిజిటల్ విధానంలో అప్డేట్ చేసుకోవచ్చు. ఎటువంటి రుసుము లేకుండా వివరాలు సరిచూసుకోవడానికి ఇది మంచి సమయం.

Read also: Twisha Sharma: ట్విషా శర్మను 'గవార్‌' అంటూ భర్త దూషించాడన్న స్నేహితులు!

 Aadhaar free update process

ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసే విధానం

పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా మీరు సొంతంగా పత్రాలను అప్‌డేట్ చేయవచ్చు. అక్కడ మీరు అప్‌లోడ్ చేసే గుర్తింపు, చిరునామా రుజువులు సరైనవిగా ఉండాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మొబైల్ నంబర్ ఆధార్‌తో అనుసంధానమై ఉండటం తప్పనిసరి. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే ఆధార్ సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చు.

Aadhaar free update: కొత్త ఆధార్ యాప్ వివరాలు

పాత యాప్ స్థానంలో ఇప్పుడు కొత్త ఆధార్ యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా ఆధార్‌కు సంబంధించిన వివిధ సేవలను సులభంగా పొందవచ్చు. అయితే బయోమెట్రిక్ మార్పులు లేదా పేరు, పుట్టిన తేదీ వంటి కీలక వివరాల కోసం మీరు దగ్గర్లోని సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ మాత్రమే బయోమెట్రిక్ డాటా అప్డేట్ చేయడం సాధ్యమవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha