Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆధార్తో 'సర్'న్ను సరిచేయలేమా!

ఆధార్తో 'సర్'న్ను సరిచేయలేమా!

వార్త 2 weeks ago

Aadhaar : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) మూడవ దశ జూన్ నెలలో కొన్ని ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రారంభం కాబోతోంది.

ఇందులో ఎన్నో దశల ప్రక్రియలు ఉన్న,ముఖ్యంగా నెలరోజుల పాటు బూత్ లెవెల్ ఆఫీసర్స్ (బిఎల్ లు) ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ పత్రాలుఇచ్చి, పూర్తి చేసిన తర్వాత వాటిని స్వీకరించి, ఆ పత్రాలను ఇచ్చిన వారికే ఓటు హక్కు కల్పించడంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. గతంలో 2002లో మన ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఈ సమగ్ర సవరణను 24ఏళ్ల తర్వాత మళ్లీ 2026లో మన తెలుగు రాష్ట్రాలలో చేపడుతున్నారు. దేశ స్వాతంత్య్రానంతరం జరుగుతున్న11వ సమగ్ర సవరణ ఇటీవల 2025లో తొలిసారిగా బీహారాష్ట్రం నుంచి ప్రారం భించారు. ఈ సవరణలో ఆ రాష్ట్రంలో సర్వసాధారణ గుర్తిం పు కార్డుగా భావించే ఆధార్ కార్డును అంగీకరించకుండా ఈసీ సూచించిన మొత్తం 11రకాల కార్డులు, పత్రాలను ఆమోదించి ఓటు హక్కును కల్పించడంతో రాజకీయ పార్టీ లలో కలవరం మొదలైంది. అదే లేకుంటే సర్ సజావుగా సాగిపోయేది.
20సంవత్సరాల వ్యవధిలో ఈసీ ప్రకటించిన గణాంకాల ప్రకారం చనిపోయిన వారు, డూప్లికేట్ ఓటర్లు, వివిధ కారణాలతో రాష్ట్రం పరిధి దాటి వెళ్లి పోయినవారు, ఇంకా అసలు ఆచూకీ తెలియని వారు మొత్తం 68లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఈ విష యంలో ఈసీ, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. రాహుల్ గాంధీ ‘ఓట్ చోర్’ యాత్రకు అంకు రార్పణకు ఈ తకరారుతో మొదలు, దేశవ్యాప్త ప్రతిపక్షాల నిరసనలు సర్పై ప్రభావం చూపలేకపోయాయి. రెండో దశలో మరి కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగింది. ఈ దశలో పశ్చిమ బెంగాల్లో జరిగిన రభస ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. 90లక్షలకు పైగా ఓట్లను తొలగిం చారు. ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా, ఈ అంశంలో ఏర్పడిన సందేహాలపై సుప్రీంకోర్టులో వాదించారు కూడా. చివరికి ఈసీ, టిఎంసి, బిజెపిల పరస్పర ఆరోపణలు, దాడులు సుప్రీంకోర్టుకే తలనొప్పి తెప్పించాయి.

Read Also : US-F-1 Visa: అమెరికా ఎఫ్-1 వీసా స్లాట్లు దొరక్క విద్యార్థుల ఆందోళన

 Aadhaar

Aadhaar : అధికారమే లక్ష్యంగా…

ముఖ్యంగా’సర్’ లో చాలా రాష్ట్రాలలో అధికార పక్షం, ప్రతిపక్షాల ఓటర్లను గుర్తించి.. ఆయా రాష్ట్రాలలో రాజకీయ పార్టీల అధికారమే లక్ష్యంగా.. కొందరి ఓటర్లను కొందరు కావాలనే ఉద్దేశపూర్వ కంగా, అక్రమంగా తొలగించారన్నది ప్రస్తుత ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలలో వాస్తవం లేదని నిరూపించుకోవాల్సి న బాధ్యత ‘సర్’ పై అంటే ఈసీ పై నే ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు ‘సర్’ చట్టబద్ధమైనదని ఆ హక్కు ఈసీకి ఉందని తేల్చి చెప్పింది. ఈసీ మాత్రం తన పని తాను చేసుకుపోతూనే ఉంది. ఇక అసలు విషయానికి వస్తే.. మన రెండు తెలుగురాష్ట్రాల్లో దేశ సరిహద్దు రాష్ట్రాలైన బీహార్, పశ్చిమ బెంగాల్లో లాగా ఎక్కువ మంది అక్రమ వలసదారులు ఉండకపోవచ్చు. అయితే హైదరాబాద్ వంటి నగరాలలో అక్రమ వలసదారులుకొందరు ఉండవచ్చు. ఇటీవల ఉగ్రవాదుల మూలాలు విజయవాడలో గుర్తించాక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్రమవలసదారులు లేరనే నిర్ణయానికి రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సర్ ఓటర్ల జాబితా ప్రక్రి యలో లోపాలు ఎక్కడ ఉంటున్నాయి? ఎవరు, ఎలా సరిది ద్దాలి? అనే అంశంపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించాలన్న రాజ్యాంగబద్ధ హక్కును ఎలా పరిరక్షించుకోవాలనే అంశంపై దృష్టి సారించాలి. ఇతర రాష్ట్రాల్లోని అనుభవాలను స్వీకరించి, అధ్యయనం చేసి లోపరహిత ఓటర్ జాబితా తయారు చేయవలసిన కర్తవ్యం ఈసీ, ప్రభుత్వ అధికారులు పైన ఉంటే… అందుకు పూర్తిగా సహకారం అందించవలసిన బాధ్యత ప్రజల పైన, రాజకీయ పార్టీల పైన ఉందన్నది వాస్తవం. ఆ బాధ్యతా యుత, కర్తవ్య నిర్వహణలో భాగంగా ప్రభుత్వ అధికారు లతో పాటు, ఈసీ గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు భాగస్వామ్యం కల్పించింది. ఆ జాతీయ, రాష్ట్ర పార్టీల తరపున బూత్ లెవెల్ ఏజెంట్ (బిఎల్ఎ) లను నియమించుకునే అవకాశం కల్పించింది. అంతేగాక వీరికి ఈసీ, సర్పై పూర్తిస్థాయి శిక్షణ కూడా ఇస్తున్నారు.

ఎన్యుమరేషన్ పత్రం

జూలై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిపోతున్న వారు కూడా ఎన్యుమరేషన్ పత్రం ద్వారా ఓటు హక్కు పొందే అవకాశం కల్పించారు. ఎవరైతే ఆమోదించబడిన ధ్రువీకరణ పత్రాలతో ఎన్యుమరేషన్ పత్రాలను తిరిగి ఇస్తారో… వారికే ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని ఈసి స్పష్టం చేసింది. తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారికి ఆన్ లైన్ లో కూడా సంబంధిత పత్రాలతో ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. అంతేగాక కుటుం బ యజమాని కూడా వారి తరఫున ఎన్యుమరేషన్ పత్రా నికి, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జతచేసి గార్డియన్ గా సంతకం చేసి ఇచ్చే అవకాశం కూడా కల్పించింది. ఇక్కడ గమనించాల్సిన ఓటర్ల జాబితా ప్రక్రి యలోలోపాలు ఎక్కడ ఉంటున్నాయి? ఎవరు, ఎలా సరిది ద్దాలి? అనే అంశంపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించాలన్న రాజ్యాంగబద్ధ హక్కును ఎలా పరిరక్షించుకోవాలనే అంశంపై దృష్టి సారించాలి. ఇతర రాష్ట్రాల్లోని అనుభవాలను స్వీకరించి, అధ్యయనం చేసి లోపరహిత ఓటర్ జాబితా తయారు చేయవలసిన కర్తవ్యం ఈసీ,ప్రభుత్వ అధికారుల పైన ఉంటే… అందుకు పూర్తిగా సహకారం అందించవలసిన బాధ్యత ప్రజల పైన, రాజకీయ పార్టీల పైన ఉందన్నది వాస్తవం. ఆ బాధ్యతాయుత, కర్తవ్య నిర్వహణలో భాగంగా ప్రభుత్వ అధికారు లతో పాటు, ఈసీ గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు భాగస్వామ్యం కల్పించింది. ఆ జాతీయ, రాష్ట్ర పార్టీల తరపున బూత్లె వెల్ ఏజెంట్ (బిఎల్ఎ) లను నియమించుకునే అవకాశం కల్పించింది. అంతేగాక వీరికి ఈసీ. సర్పై పూర్తిస్థాయి శిక్షణ కూడా ఇస్తున్నారు. జూలై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిపోతున్న వారు కూడా ఎన్యుమరేషన్ పత్రం ద్వారా ఓటు హక్కు పొందే అవకాశం కల్పించారు. ఎవరైతే ఆమోదించబడిన ధ్రువీకరణ పత్రాలతో ఎన్యుమరేషన్ పత్రాలను తిరిగి ఇస్తారో… వారికే ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని ఈసి స్పష్టం చేసింది.

డూప్లికేట్ ఓట్లను గుర్తించి

తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారికి ఆన్ లైన్ లో కూడా సంబంధిత పత్రాలతో ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. అంతేగాక కుటుం బ యజమాని కూడా వారి తరఫున ఎన్యుమరేషన్ పత్రానికి, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జతచేసి గార్డియన్ గా సంతకంచేసి ఇచ్చే అవకాశం కూడా కల్పించింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే చనిపోయిన వారి తరఫున, మరోచోట ఓటు ఉన్న వారి తరఫున ఎన్యు మరేషన్ పత్రాలను పూర్తి చేసి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇస్తే వారి ఓట్లను గుర్తించి తొలగించడం ఎంతవరకు సాధ్య మన్న విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒక యాప్ ద్వారా జరుగుతోన్న ఈ తతంగంలోనే అసలు సమస్య మొదలవుతుంది. ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోక పోవడం వల్ల డూప్లికేట్ ఓట్లను తొలగించే అవకాశం తగ్గిపోతుంది. డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీ ద్వారా కంప్యూ టర్లో కొన్ని డూప్లికేట్ ఓట్లను గుర్తించిన, సరైన నిర్ధారణ లేకుండా తొలగించలేక పోతున్నారు. ఎన్నికల సంఘం నిర్వ హించిన గత స్పెషల్ సమ్మరీ రివిజన్లో అనేక లోపాలు ఉన్నాయి. చనిపోయిన వారిని ఓటర్ లిస్ట్నుండి తొలగించ డంలో బిఎల్డీలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక ఓటర్ను తొలగించాలంటే 2024 ఎన్నికలకు ముందు ఎన్నో నిబంధనలు ఉన్నాయి. తర్వాత వాటిని కొంతమేర సవరించారు. డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను గుర్తించి వారి డూప్లికేట్ ఓట్లను కొంతవరకు బయటకు తీశారు. మీరు ఎక్కడ ఓటు ఉంచుకోవాలనుకుంటున్నారో తెలుపమనివారికి అప్పుడు నోటీసులు జారీ చేశారు. అందులో కొద్ది మంది మాత్రమే స్పందించారు. మరికొద్దిమంది అసలు స్పందించ లేదు. డూప్లికేట్ ఓటర్ ను కచ్చితంగా తొలగించాలి అంటే ఆధార్ కార్డుతో అనుసంధానం ఒకటే మార్గం.

 Aadhaar

ఓటరు జాబితా ప్రక్షాళన

అయితే సర్ లో ఆధారకార్డును ఒక గుర్తింపు కార్డుగా మాత్రమే ఉపయో గించాలి గాని, పౌరసత్వం నిర్ధారణ కోసం ఉపయోగించకూ డదని… ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు కల్పించబోమని చెప్పడం కుదరదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉండటంతో ఆధార్కార్డు ద్వారా డూప్లికేట్ ఓట్లను తొలగిం చడంలో కొంత స్తబ్దత ఏర్పడింది. సర్లో కుటుంబ యజ మాని ప్రస్తుతం ఇంట్లోలేని వ్యక్తుల ఎన్యుమరేషన్ పత్రాల ను పూర్తిచేసి ఇచ్చే అవకాశం కల్పించారు. గ్రామీణ ప్రాంతా ల్లో నియమించే బిఎల్ఎలకు అక్కడ ఓటర్లందరూ తెలిసి ఉండే అవకాశం ఉంటుంది. అర్బన్ ఏరియాలో ఆ పరిస్థితి లేదు . నేడు తమ ఇంటి పక్కన ఎవరు ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి నగరాలలో నెలకొనిఉంది. ఈ నేపథ్యంలో అర్బన్ ఏరియాలో డూప్లికేట్ ఓట్లను తొలగించడం కోసం గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు ఉపయోగిస్తే డూప్లికేట్ ఓట్లు తొలగించడం చాలా సులభతరం అవుతుంది. సుప్రీంకోర్టు ఆధార కార్డును పౌరసత్వ నిర్ధారణకు ఉపయోగించకూడదని చెప్పిందే కానీ డూప్లికేట్ ఓట్లను తొలగించటంలో ఉపయో గించ వద్దని చెప్పలేదు. నేడు ఆధార్ కార్డు భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో లేనివారు దాదాపు లేరనేచెప్పాలి. పుట్టిన తర్వాత కొద్ది రోజులకే ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి గుర్తింపు కార్డుగా ఆధార్కా ర్డును ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ఆధార కార్డు ఉన్నచోటే ఓటు హక్కును కూడా కలిగి ఉండటం మంచిది. ఒకవేళ ఆధార్ కార్డు ఒక అడ్రస్లో ఉండి, ఓటుహక్కు ఇంకొక అడ్రస్ ఉంటే ఆధార కార్డు అడ్రస్ ను త్వరితగతిన సులభంగా మార్చుకునే అవకాశం కల్పించాలి. దీంతో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుడు మాత్రమే ఓటర్ల జాబితా ప్రక్షాళన అనేది బాగా జరుగుతుంది. ఏది ఏమైనా ఓటర్ జాబితా ప్రక్షాళనలో బిఎల్ ఓ లు, వారి పై అధికారులు, బిఎల్ఎలు, రాజకీయ పార్టీలు ప్రజలు నిష్పక్షపాతంగా, నిజాయితీగా వ్యవహరించినట్లయితే ఓటరు జాబితా పూర్తిగా ప్రక్షాళన అవుతుంది. అప్పుడే ‘సర్’ లక్ష్యం నూటికి నూరు పాళ్లూ నెరవేరినట్లే.!

-డాక్టర్ టి . సేవకుమార్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

పీఎం కిసాన్ 23వ విడత వచ్చేది ఆ నెలలోనే.. డేట్ ఫిక్స్ అయినట్లేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha