Smart ration cards telangana:తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి ఐదు లక్షలకు పైగా లబ్ధిదారులకు ఈ డిజిటల్ కార్డులు అందనున్నాయి.
క్యూఆర్ కోడ్ విధానంతో వస్తున్న ఈ కార్డుల ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత సులభంగా అందే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది.
Read also: Cheruvugattu Fire Accident: చెరువు గట్టులో భారీ అగ్నిప్రమాదం..17 దుకాణాలు దగ్ధం
Telangana to distribute smart ration cards
హైదరాబాద్ వేదికగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పంపిణీని ప్రారంభిస్తారు. ఆగస్టు మొదటి వారం లేదా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్డులను ప్రజలకు అందించనున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
Smart ration cards telangana:కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ మరియు మంత్రి ఉత్తమ్ ఫొటోలు ముద్రణ
కొత్తగా జారీ చేసే ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ముద్రించారు. ఆధునిక సాంకేతికతతో తయారైన ఈ కార్డుల ద్వారా నకిలీ రేషన్ కార్డులకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు. ప్రతి కుటుంబం సులభంగా రేషన్ సరుకులు పొందేలా ఈ డిజిటల్ విధానం ఎంతగానో దోహదపడుతుంది.
Epaper: epaper.vaartha.com

