Dailyhunt
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన అంబులెన్స్.. నలుగురు దుర్మరణం

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన అంబులెన్స్.. నలుగురు దుర్మరణం

వార్త 5 days ago

Srikalahasti road accident: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఓరందూరు హైవే వద్ద సోమవారం తెల్లవారుజామున పెను ప్రమాదం సంభవించింది. కోల్‌కతా నుంచి బెంగళూరుకు రోగిని తరలిస్తున్న అంబులెన్స్, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Read also: Tirumala: శ్రీవారిపై అపార భక్తి.. వెయ్యిసార్లు మెట్ల దారిలో నడిచిన రిటైర్డ్ టీచర్!

 Srikalahasti Ambulance Accident Site

Srikalahasti road accident: నిద్రమత్తే ప్రాణాలు తీసిందా?

ఈ ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. వాహనంలో ఉన్న రోగితో పాటు అతడికి సాయంగా వచ్చిన ముగ్గురు కూడా మరణించడం స్థానికంగా కలకలం రేపింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. హైవేపై ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.

కైలాసగిరిలో వృద్ధుడి ఆత్మహత్య

అదే ప్రాంతంలోని కైలాసగిరి కాలనీలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవ పడిన వెంకటయ్య అనే వృద్ధుడు ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో భార్యతో వాగ్వాదానికి దిగిన ఆయన, అర్ధరాత్రి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ రెండు వేర్వేరు ఘటనలపై శ్రీకాళహస్తి పోలీసులు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఏపీ, తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్ష సూచన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha