Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆహార వృథాను నివారిస్తేనే సమాజ ప్రగతి

ఆహార వృథాను నివారిస్తేనే సమాజ ప్రగతి

వార్త 1 week ago

Food Waste : ఆహారం అనేది కేవలం ఆకలిని తీర్చే పదార్థం మాత్రమే కాదు. అది మనిషి జీవనానికి ఆధారం, ఆరోగ్యానికి పునాది, శరీరానికి శక్తి, కుటుంబానికి భరోసా, సమాజానికి బాధ్యతను గుర్తుచేసే ఒక గొప్ప జీవన సత్యం.

మనిషి సం పాదించే సంపద ఎంత ఉన్నా, ఎంతటి ఉన్నత స్థానంలో ఉ న్నా, ఆకలి వేసినప్పుడు అవసరమయ్యేది ఒక్క ముద్ద అన్నమే. అందుకే ఆహారం విలువను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఆకలితో బాధపడుతున్న వారి పరిస్థితిని అర్ధం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రతి సంవత్సరం అక్టో బర్లో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వ హిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆకలిని నిర్మూలించడం, పోషకాహారంపై అవగా హన పెంపొందించడం, ఆహార భద్రతను సాధించడం, ప్రతి ఒక రికీ సరిపడా ఆరోగ్యకరమైన ఆహారం అందేలా కృషి చేయడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశాలు. నేడు మనిషి ఆహారపు అలవాట్లను, సమాజంలో ఆకలి పరిస్థితులను, మనిషి బాధ్యతలను ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన రోజు. చాలామందికి ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం లభిం చడం సహజమైన విషయంగా అనిపిస్తుంది. ఇంట్లో వండిన భోజనం, హోటళ్లలో లభించే వంటకాలు, వేడుకల్లోవడ్డించే విందులు మన జీవితంలో సాధారణ దృశ్యాలుగా మారిపో యాయి. అయితే అదే సమయంలో ఒక పూట భోజనం కోసం ఎదురుచూసే కుటుంబాలు, రాత్రి ఆకలితోనిద్రపోయే పిల్లలు, వృద్ధాప్యంలో ఆదరించే వారు లేక ఆహారం కోసం ఇతరులపై ఆధారపడే వృద్ధులు కూడా నేటి సమాజంలో ఉన్నారు.

 Food Waste

Food Waste : ఆహారాన్ని గౌరవించడం అంటే రైతును గౌరవించడం

ప్లేట్లలో మిగిలిపోయే అన్నం మరొకరి ఆకలిని తీర్చగలదనే ఆలోచన మనలో ఎంతమందికి వస్తుంది? మనం తినకుండా పారవేసే ఆహారం వెనుక రైతు శ్రమ, భూమి, నీరు, విద్యుత్తు, విత్తనాలు, రవాణా, వంట చేసిన వారి కష్టం దాగి ఉన్నాయి. ఒక గింజ అన్నం మన చేతికి చేరే వరకు ఎన్నో దశల్లో ఎంతోమంది శ్రమిస్తారు. కాబట్టి ఆహారాన్ని గౌరవించడం అంటే రైతును గౌరవించడం, ప్రకృతిని గౌరవించడం, మానవ శ్రమకు విలువ ఇవ్వడం. ఆకలి విలువను నిజంగా అర్థం చేసుకోవాలంటే ఆకలితో ఉన్న వ్యక్తి పరిస్థితిని మనసుతో ఊహించుకోవాలి. కడుపు నిండిన వ్యక్తికి ఆహారం ఒక ఎంపిక కావచ్చు. ఆకలితోఉన్న వ్యక్తికి అదే ఆహారం జీవనాధారం. అందుకే అన్నదానం అనేది కేవలం భోజనం పెట్టడం మాత్రమే కాదు, ఒక మనిషికి ఆ క్షణంలో జీవించే ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని అందించడం కూడా. ఒకవైపు వివాహాలు, శుభకార్యాలు, విందులు, హోటళ్లు, వేడుకల్లో అవసరానికి మించి ఆహారాన్ని సిద్ధంచేసి చివరకు పారవేస్తున్న పరిస్థితులు కనిపిస్తు న్నాయి. మరోవైపు పేదరికం, నిరుద్యోగం, నిరాశ్రయత్వం, కుటుంబ సమస్యలు, వృద్ధాప్య అసహాయతవంటి కారణా లతో కనీస భోజనం కూడా పొందలేని వారు ఉన్నారు. నగరాల్లోని రహదారుల పక్కన, ఫుట్పాత్లపై జీవించే నిరాశ్రయులు, అనాథ పిల్లలు, ఒంటరిగా మిగిలిపోయిన వృద్ధులు, సంచార జీవనం సాగించే కుటుంబాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. వారికి ప్రతిరోజూ ఆహా రం ఎక్కడ లభిస్తుంది? తాగడానికి పరిశుభ్రమైన నీరు దొరు కుతుందా? అనారోగ్యంతో ఉన్నప్పుడు పోషకాహారం పొంద గలుగుతున్నారా? అనే ప్రశ్నలు ఆలోచింపజేయాలి.

ఆకలి అనేది కేవలం ఆర్ధిక సమస్యమాత్రమే కాదు

ఆకలి అనేది కేవలం ఆర్ధిక సమస్యమాత్రమే కాదు. అదిఆరోగ్యం, విద్య, ఉపాధి, సామాజిక సమానత్వంతో ముడిపడి ఉన్న సమస్య. సరైన ఆహారం అందక పోతే పిల్లల్లో ఎదుగుదల మందగించవచ్చు, చదువుపై ఏకాగ్రత తగ్గవచ్చు, పెద్దల్లో పని చేసే శక్తి తగ్గవచ్చు. వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు తీవ్రమవచ్చు. అందువల్ల ఆకలిని తగ్గించడం అంటే ఒక వ్యక్తి ప్రస్తుత అవసరాన్ని తీర్చడమే కాకుండా, అతని భవి ష్యత్తుకు కూడా తోడ్పడటం. అయితే ఆకలితో ఉన్న ప్రతి వ్యక్తి పరిస్థితి ఒకేలా ఉండదు. కొందరికి తాత్కాలికంగా భోజనం అవసరమవుతుంది. మరికొందరికి నిరంతర ఆహార సహాయంతో పాటు ఉపాధి, నివాసం, వైద్యం, విద్య వంటి అవకాశాలు అవసరమవుతాయి. కాబట్టి తక్షణ సహాయంతో పాటు దీర్ఘకాలిక పరిష్కారాలపై కూడా దృష్టిపెట్టాలి. ఆహార కొరతను తగ్గించడానికి ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు మాత్రమే పనిచేస్తే సరిపోదు. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి తనవంతు బాధ్యతను నిర్వర్తించాలి. అవసరానికి మించి వండటం, ప్లేట్లలో ఎక్కువగా వడ్డించుకోవడం, మిగిలిన ఆహారాన్ని నిర్లక్ష్యంగా పారవేయడం వంటి అలవాట్లను మార్చుకోవాలి. మీకు ఎంత ఆహారం అవసరమో అంతే తీసుకోవాలి. అవసరమైనంత మాత్రమే వండుకోవాలి. మిగి లిన సురక్షితమైన ఆహారాన్ని సరైనపద్ధతుల్లో నిల్వ చేయా లి. ఆహారాన్ని ఇతరులకు అందించాలనుకుంటే దానినాణ్యత, పరిశుభ్రత, నిల్వ సమయం వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి.

 Food Waste

పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి

వివాహాలు, పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ఇతర వేడుకల్లో మిగిలే సురక్షి తమైన ఆహారాన్ని బాధ్యతా యుతంగా అవసరమైన వారికి అందించే వ్యవస్థలను ప్రోత్స హించాలి. అన్నదానాన్ని అలవాటుగా మార్చుకోవాలి, సహా యం పొందుతున్న వారిని పేదవారిగా, అసహాయులుగా తక్కువ చేసి చూడకూడదు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడు తూ, వివక్ష లేకుండా, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలి. మానవత్వం అందరిలో ఉండాలి. పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందించాలి చిన్నప్పటినుంచే అన్నం వృథా చేయకూడ దని, రైతుకష్టాన్ని గౌరవించాలని, అవసరమైన వారికి సహా యం చేయాలని నేర్పాలి. పాఠశాలల్లో ఆహారవిలువ, పోష కాహారం, పరిశుభ్రత, ఆహార వృథా నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కడుపు నిండటం మాత్రమే సరిపోదు. సమతుల్య మైన, పోషకమైన ఆహారం కూడా అవసరం. పిల్లలు, గర్భి ణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి వారి అవసరా లకు తగిన ఆహారం అందేలా శ్రద్ధచూపాలి. ప్రభుత్వ పథ కాలను బలోపేతం చేయాలి. ప్రజాపంపిణీ వ్యవస్థ, పాఠశా లల్లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ పోషకాహార కార్య క్రమాలు వంటి సేవలు అర్హులైనవారికి సక్రమంగా అందేలా పర్యవేక్షించాలి. ఆకలితో ఉన్న కుటుంబాలకు ఆహార భద్రత తోపాటు ఉపాధి, విద్య, వైద్య సహాయం అందించాలి. స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన సంఘాలు, దాతలు, స్థానిక సమూహాలు కలిసి అవసరమైన ప్రాంతాలను గుర్తిం చి క్రమం తప్పకుండా అన్నదానం నిర్వహించవచ్చు.

-వై. సంజీవ కుమార్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

భాగ్యనగరానికి నీటి కష్టాలు తప్పవా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha