Ramatheertham Temple Development: రాష్ట్రంలో ఆలయాల పవిత్రతను సంరక్షించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
రామతీర్ధం నీలాచలం చుట్టూ గిరిప్రదక్షిణ కోసం రూ.3.40కోట్ల ఉపాధిహామీ నిధులతో కొత్తగా నిర్మించిన గిరి ప్రదక్షిణ బిటి రహదారిని పవన్ కల్యాణ్ బుధవారం అమరావతి నుంచి వర్చువల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చాలా ఆలయాల పునర్జీవనానికి కృషి చేస్తున్నామని చెప్పారు. పంచాయితీరాజ్, సాస్కి నిధులు సుమారు రూ.40కోట్లతో 22 ప్రధాన ఆలయాల వద్ద అభివృద్ధి పనులను మంజూరు చేశామన్నారు.

We Will Protect the Sanctity of Temples - Pawan Kalyan
Ramatheertham Temple Development: భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు
రామతీర్థం గిరి ప్రదర్శనకు వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగించడానికి రూ.3.40 కోట్లతో ఈ రహదారిని మంజూరు చేశామని తెలిపారు. ఈ రూపంలో రామునికి సేవ చేసుకొనే భాగ్యం కలిగిందని పేర్కొన్నారు. మన సంస్కృతిని పరిరక్షించేందుకు, సంప్రదాయాలను కాపాడేందుకు, ఆలయాల పవిత్రతను రక్షించేందుకు కృషి చేయడం జరుగుతోందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వర్చవల్ గా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఇటీవల కాలంలో గుడికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోందని, దానికి తగ్గట్టుగా సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ధర్మాన్ని రక్షిస్తే, అదే తమను రక్షిస్తుందని తాము నమ్ముతున్నామని స్పష్టం చేశారు.
ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు
రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, సంక్షేమం, అభివృద్ధితోపాటు, ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ గా రూపొందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో ఇప్పటికే శ్రీకాళహస్తి ఆలయం వద్ద గిరిప్రదర్శ కోసం రహదారిని నిర్మించడం జరిగిందని, ఇప్పుడు రామతీర్ధం వద్ద ప్రారంభించామని, కోటప్పకొండ వద్ద రహదారి నిర్మాణం త్వరలో పూర్తికానుందని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రతిపాదనలు వచ్చాయని, దీనిపై త్వరలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

