Police Football Winners: హైదరాబాద్ లోని గచ్చిబౌలీ స్టేడియం వేదికగా జరిగిన 74వ బి. ఎన్. ముల్లిక్ స్మారక ఆలిండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్ షిప్ విజేతలుగా సిఐఎస్ఎఫ్, అసోం రైపిల్స్ నిలిచాయి.
గచ్చిబౌలీ స్టేడియంలో జరిగిన పురుషుల ఫైనల్లో టాప్ టీమ్ సిఐఎస్ఎఫ్ ఏకైక గోల్తో గోవాపై గెలుపొంది ట్రోఫీ అందుకుంది.
Read Also: RCB IPL Live Score: RCB రికార్డు స్కోరు..20 ఓవర్లలో 250/3
CM Revanth Reddy presented trophie to the winners.
Police Football Winners: ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లు
ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఈ ఫైనల్లో గోవా గోల్చేయడంలో విఫలమైంది. సిఐఎస్ఎఫ్ పార్వర్డు సమన్వయంతో కదులుతూ గోల్ సాధించింది. అంతకుముందు జరిగిన మూడో స్థానం పోటీలో కేరళ 1-0తో ఒడిశాపై నెగ్గి మూడోస్థానం పొందింది. మహిళల ఫైనల్లో అసోం రైఫిల్ 1-0తో ఒడిషాపై గెలుపొందింది. సిఐఎస్ఎఫ్కు మూడోస్థానం దక్కింది. మార్చి 25 నుంచి 12 రోజుల పాటు జరిగిన పోలీస్ ఫుట్బాల్లో 43 పరుషుల జట్లు, 9 మహిళల జట్లు తలపడ్డాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందడి
ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాసేపు ఫుట్బాల్ ఆడి ప్రేక్షకులను అలరించారు. అనంతరం విజేతలకు ట్రోఫీలను అందజేశారు. బిజయ్ బెహరా (ఒడిశా, 8 గోల్స్), ప్యారీ(ఒడిషా, 7 గోల్స్)కు గోల్డెన్ బూట్ లభించింది. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, డిజీపీ శివధర్ రెడ్డి, సాట్ ఛైర్మన్ శివసేనారెడ్డితో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

