Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆమె మాయలో పడ్డాడంటూ హార్దిక్ పై ఫ్యాన్స్ ఫైర్..

ఆమె మాయలో పడ్డాడంటూ హార్దిక్ పై ఫ్యాన్స్ ఫైర్..

వార్త 3 weeks ago

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి హార్దిక్ పాండ్య ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరిగిన కీలక మ్యాచ్‌లో జట్టు ఓటమిపాలవ్వడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ హార్దిక్ ఘోరంగా విఫలమయ్యారు. 23 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులు మాత్రమే చేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కీలక సమయంలో వేగంగా ఆడాల్సింది పోయి, జిడ్డు బ్యాటింగ్‌తో జట్టుపై ఒత్తిడి పెంచారని నెటిజన్లు మండిపడుతున్నారు.

వ్యక్తిగత జీవితంపై విమర్శలు – మహీకా మాయలో పడ్డాడా?

హార్దిక్ పాండ్య ఆటతీరుపై వస్తున్న విమర్శలు ఇప్పుడు అతడి వ్యక్తిగత జీవితం వైపు మళ్లాయి. హార్దిక్ తన స్నేహితురాలు మహీకా శర్మతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతూ ఆటను గాలికొదిలేశారని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. “ఆమె మాయలో పడి క్రికెట్‌ను నిర్లక్ష్యం చేస్తున్నాడు.. అందుకే క్రీజులో ఏకాగ్రత కోల్పోతున్నాడు” అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో హార్దిక్ ప్రవర్తన, మైదానంలో అతడి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే కెప్టెన్సీ బాధ్యతల కంటే పర్సనల్ లైఫ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Read Also : వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తప్పిస్తారా? అసలు కారణం ఇదే!

ముంబై ఇండియన్స్ సంక్షోభం – సీనియర్ల వైఫల్యం

ఒక్క హార్దిక్ మాత్రమే కాదు, ముంబై ఇండియన్స్ జట్టులోని ఇతర కీలక ఆటగాళ్ల ప్రదర్శన కూడా ఆందోళనకరంగా మారింది. రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడం, సూర్యకుమార్ యాదవ్ తన స్థాయికి తగ్గట్టుగా రాణించకపోవడం టీమ్‌ను దెబ్బతీస్తోంది. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ వంటి స్టార్ ప్లేయర్లు వికెట్లు తీయడంలో తడబడుతుండటం జట్టును పరాజయాల పాలు చేస్తోంది. హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి, జట్టుకు దూరంగా పెట్టాలని ఒక వర్గం అభిమానులు డిమాండ్ చేస్తుండగా, మిగిలిన ఆటగాళ్లు కూడా ఫామ్ లోకి రాకపోతే ముంబైకి ఈ సీజన్ గడ్డుకాలమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha