Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు..ఐఎండీ

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు..ఐఎండీ

వార్త 1 day ago

AP Weather update: ఆంధ్రప్రదేశ్‌ను భానుడి భగభగలు వణకిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత రికార్డు స్థాయికి చేరుకోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఇటు రాయలసీమ, అటు కోస్తాంధ్ర అనే తేడా లేకుండా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ ప్రభావం మొదలై, మధ్యాహ్నానికి అది తీవ్రమైన వడగాల్పులుగా మారుతోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ఎండల తీవ్రత, రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది అనే అంశాలపై కీలక అప్‌డేట్లను విడుదల చేసింది. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. రాష్ట్రంలో ఈ తీవ్రమైన వడగాల్పుల పరిస్థితులు మరో కొన్ని రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.

Read Also: Raghurama: కొత్త పార్టీ పై క్లారిటీ ఇచ్చిన Dy స్పీకర్ రఘురామ

 AP Weather update

AP Weather update: అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుండి 45 డిగ్రీల సెల్సియస్

ముఖ్యంగా ఎండల తీవ్రతతో పాటు గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఉక్కపోత తీవ్రంగా మారి ప్రజలకు మరింత నరకం చూపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీల నుండి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. సాధారణంగా మే నెలలో ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈసారి పశ్చిమ దిశ నుండి వీస్తున్న పొడి గాలుల కారణంగా వేడి తీవ్రత మరింత పెరిగిందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ తీవ్రమైన ఎండల మధ్య వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు ఒక ఊరట కలిగించే వార్తను కూడా అందించింది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అంచనా వేసింది. దక్షిణ ద్వీపకల్పంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఎండల ధాటికి 10 లక్షల కోళ్లు మృతి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha