Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆందోల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మర్రి అరుణ కుమారి

ఆందోల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మర్రి అరుణ కుమారి

వార్త 1 week ago

Andole Constituency: తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ ఆమోదంతో మర్రి అరుణ కుమారిని సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్‌ను నియోజకవర్గంలో మరింత బలోపేతం చేస్తూ, మహిళలను సంఘటితం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తారనే విశ్వాసాన్ని పార్టీ నాయకత్వం వ్యక్తం చేసింది.

Read also: Telangana Rythu Bharosa: తెలంగాణ "రైతు భరోసా" పథకం: కొత్త రైతులకు దరఖాస్తుల స్వీకరణ

 Marri Aruna Kumari appointed as Andole Mahila Congress President.

Andole Constituency: హృదయపూర్వక కృతజ్ఞతలు

ఈ నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ, తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్, ఆందోల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, 3వ వార్డు ప్రజలకు మర్రి అరుణ కుమారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మహిళా కాంగ్రెస్ సంస్థ బలోపేతం, పార్టీ అభివృద్ధి, ప్రజాసేవ కోసం అంకితభావంతో పనిచేస్తానని ఆమె తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెంచిన PRC జులై నుంచే అమలు: మంత్రి పొన్నం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha