Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆండ్రాయిడ్ 17 తీసుకొచ్చిన టాప్-5 ఫీచర్లు ఇవే..క్రియేటర్స్‌కు ఇక తిరుగులేదు!

ఆండ్రాయిడ్ 17 తీసుకొచ్చిన టాప్-5 ఫీచర్లు ఇవే..క్రియేటర్స్‌కు ఇక తిరుగులేదు!

వార్త 2 weeks ago

Android 17 Features: గూగుల్ తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ 17' (Android 17) రోల్‌అవుట్‌ను అధికారికంగా ప్రారంభించింది. జూన్ 16న విడుదలైన ఈ మేజర్ అప్‌డేట్ ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ (Pixel 6 మరియు ఆపై మోడల్స్) స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులోకి రాగా, శామ్‌సంగ్, వన్‌ప్లస్ వంటి ఇతర బ్రాండ్ల ఫోన్‌లకు 2026 చివరి నాటికి దశలవారీగా లభించనుంది.

Read Also:Reliance Jio IPO:దేశీయ మార్కెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓ.. డ్రాఫ్ట్ పేపర్స్ సిద్ధం చేసిన రిలయన్స్ జియో

Android 17 Features: ఆండ్రాయిడ్ 17 లోని టాప్-5 విప్లవాత్మక ఫీచర్లు

  • యాప్ బబుల్స్ (Floating Bubbles): ఇప్పటివరకు కేవలం మెసేజింగ్ యాప్స్‌కే పరిమితమైన బబుల్స్ ఫీచర్‌ను ఇప్పుడు అన్ని యాప్స్‌కు విస్తరించారు. హోమ్‌స్క్రీన్‌పై ఏదైనా యాప్ ఐకాన్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా దానిని చిన్న ఫ్లోటింగ్ విండోగా మార్చవచ్చు. టాబ్లెట్లు, ఫోల్డబుల్ ఫోన్ల కోసం కింద ప్రత్యేకంగా ఒక 'బబుల్ బార్' (Bubble Bar) ను ఇచ్చారు. దీని ద్వారా ఒకేసారి మ్యాప్స్ చూస్తూ, నోట్స్ రాసుకోవడం వంటి మల్టీటాస్కింగ్ సులువవుతుంది.
  • 2. స్క్రీన్ రియాక్షన్స్ (Screen Reactions): కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్ల కోసం గూగుల్ అద్భుతమైన టూల్ ప్రవేశపెట్టింది. స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసినప్పుడు, మీ ఫోన్ స్క్రీన్‌తో పాటు ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ద్వారా మీ ముఖాన్ని కూడా ఒకేసారి రికార్డ్ చేయవచ్చు. థర్డ్ పార్టీ యాప్స్ లేదా గ్రీన్ స్క్రీన్ అవసరం లేకుండానే నేరుగా రియాక్షన్ వీడియోలు, ట్యుటోరియల్స్ తయారు చేసుకోవచ్చు.
  • 3. ఫోల్డబుల్ గేమింగ్ మోడ్ (Foldable Gaming Mode): ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల (ఉదాహరణకు Pixel Pro Fold, Galaxy Fold) కోసం సరికొత్త 50/50 స్ప్లిట్ లేఅవుట్ డిజైన్ చేశారు. దీని ప్రకారం.. ఫోల్డబుల్ డిస్‌ప్లే పైభాగంలో గేమ్ రన్ అవుతుంటే, కింది భాగం ఒక డైనమిక్ వర్చువల్ గేమ్‌ప్యాడ్ (Gamepad) గా మారుతుంది. ఇది క్లాసిక్ నింటెండో హ్యాండ్‌హెల్డ్ కన్సోల్ లాంటి ఫీలింగ్‌ను ఇస్తుంది.
  • 4. అడ్వాన్స్‌డ్ యాంటీ-థెఫ్ట్ & ప్రైవసీ: మీ ఫోన్ దొంగిలించబడినా, దొంగకు మీ పిన్ నంబర్ తెలిసినా డేటా సేఫ్‌గా ఉండేలా 'మార్క్ యాజ్ లాస్ట్' (Mark as Lost) ఫీచర్‌ను Find Hub లో చేర్చారు. దీని ద్వారా బయోమెట్రిక్ (ఫింగర్‌ప్రింట్/ఫేస్ లాక్) ఉంటేనే ఫోన్ అన్‌లాక్ అవుతుంది. అలాగే యాప్స్‌కు కేవలం ఒక్కసారి మాత్రమే లొకేషన్ యాక్సెస్ ఇచ్చే 'తాత్కాలిక లొకేషన్ పర్మిషన్', మొత్తం కాంటాక్ట్స్ కాకుండా కేవలం నిర్దిష్ట నంబర్లను మాత్రమే షేర్ చేసే ప్రైవసీ కంట్రోల్స్ వచ్చాయి. దొంగలు పిన్ నంబర్ గెస్ చేయకుండా ఉండేందుకు ప్రతి తప్పుడు అటెంప్ట్‌కు వెయిటింగ్ టైమ్‌ను పెంచారు.
  • 5. గెమిని ఇంటెలిజెన్స్ (Gemini Intelligence): ఈ ఏడాది వేసవి చివరలో (లేటర్ దిస్ సమ్మర్) కొన్ని ఎంపిక చేసిన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లలో గూగుల్ మరింత అడ్వాన్స్‌డ్ 'గెమిని ఇంటెలిజెన్స్' ఫీచర్లను జోడించనుంది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ కోర్ లెవెల్‌లో పని చేస్తూ రోజువారీ టాస్కులను ఆటోమేట్ చేస్తుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

10,000 మంది ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇవ్వనున్న విప్రో

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha