Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆప్ నేతలపై అన్నా హజారే ఘాటు విమర్శలు

ఆప్ నేతలపై అన్నా హజారే ఘాటు విమర్శలు

వార్త 2 months ago

Anna Hazare: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద రాజకీయ సంక్షోభం తలెత్తింది. పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డాతో పాటు మొత్తం ఏడుగురు ఎంపీలు శుక్రవారం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరుతున్నట్లు ప్రకటించారు.

రాజ్యసభలో (AAP) కున్న 10 మంది సభ్యులలో మూడింట రెండొంతుల మంది (2/3rd) అంటే ఏడుగురు సభ్యులు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

Read Also:Paytm: పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్.. లైసెన్స్ రద్దు!

 Raghav Chadha 7 AAP MPs join BJP

Anna Hazare: ఆప్ వైఖరిపై అన్నా హజారే నిప్పులు.. 'అధికారం, డబ్బుకే ప్రాధాన్యం'

ఈ పరిణామాలపై ఆప్ వ్యవస్థాపక ఉద్యమ నేత అన్నా హజారే తీవ్రంగా స్పందించారు. పార్టీ పతనంపై విచారం వ్యక్తం చేస్తూ ఆప్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. “ఒక పార్టీ నుండి ఇంతమంది నేతలు వెళ్ళిపోతున్నారంటే అది ఖచ్చితంగా నాయకత్వ వైఫల్యమే. ఆప్ తన మూల సిద్ధాంతాలను విస్మరించి, కేవలం అధికారం మరియు డబ్బుపైనే దృష్టి సారించింది. స్వార్థం పెరిగినప్పుడు సిద్ధాంతాలు గాలికి కొట్టుకుపోతాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ మారే హక్కు ఉంటుందని, అయితే సిద్ధాంతాలను నమ్ముకున్న వారు ఇలా చేయరని ఆయన పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఉక్రుల్ జిల్లాలో ఘర్షణలు.. ముగ్గురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha