Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్‌కు మళ్లీ షాక్.. 2027 వరకు వేచి చూడాలి!

ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్‌కు మళ్లీ షాక్.. 2027 వరకు వేచి చూడాలి!

వార్త 2 months ago

Apple AR Glasses : ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్ విడుదల మరింత ఆలస్యం కానుంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఉత్పత్తిని 2027 చివరి వరకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

మొదటగా 2026 చివర్లో ఆవిష్కరించి, 2027 ప్రారంభంలో మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ ప్రణాళిక రూపొందించినప్పటికీ, అభివృద్ధి ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సవాళ్ల కారణంగా షెడ్యూల్ మారినట్లు సమాచారం.

సాధారణ కళ్లజోళ్ల మార్కెట్‌పై దృష్టి

ఆపిల్ ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను కేవలం టెక్నాలజీ ఉత్పత్తిగా కాకుండా, సాధారణ కళ్లజోళ్ల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తోంది. ఆపిల్ వాచ్ తరహాలో ఫ్యాషన్, సాంకేతికత కలయికగా ఈ ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉన్న ఐవేర్ మార్కెట్‌లో కీలక స్థానం సంపాదించాలనే లక్ష్యంతో ఆపిల్ ముందుకు సాగుతోంది.

Read Also : వాట్సప్‌లో సరికొత్త 'కాంటాక్ట్స్ హబ్' ఫీచర్

 Apple AR Glasses

ఫీచర్లు, ధరపై అంచనాలు

తొలి వెర్షన్ స్మార్ట్ గ్లాసెస్‌లో అగుమెంటెడ్ రియాలిటీ డిస్‌ప్లేలు ఉండకపోవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. బదులుగా రోజువారీ అవసరాలకు ఉపయోగపడే ఫీచర్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫోటోలు, వీడియోలు తీయడానికి కెమెరాలు, కాల్స్ మాట్లాడేందుకు మైక్రోఫోన్లు, సంగీతం వినేందుకు స్పీకర్లు, వాయిస్ అసిస్టెంట్ సేవలు ఇందులో ఉండే అవకాశం ఉంది.

అలాగే నడక మార్గదర్శకాలు, స్మార్ట్ నోటిఫికేషన్లు వంటి ఫీచర్లను కూడా అందించే అవకాశముంది. పలు రకాల ఫ్రేమ్ డిజైన్లను కంపెనీ పరిశీలిస్తోంది. వీటి ధర 200 నుంచి 500 డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. తక్కువ బరువు, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోసం ప్రత్యేక ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుపై ఆపిల్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఐఫోన్ దొంగతనాలకు చెక్.. యాపిల్ సరికొత్త సెక్యూరిటీ ప్లాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha