Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్ఎంపీ డాక్టర్ కొట్టాడని నర్సు ఆత్మహత్య!

ఆర్ఎంపీ డాక్టర్ కొట్టాడని నర్సు ఆత్మహత్య!

వార్త 2 months ago

Sattenapalli Nurse Suicide: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక వావిలాల నగర్‌కు చెందిన గోవర్ధన (40) అనే వివాహిత తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.

నర్సుగా పనిచేస్తున్న ఆమె ఇలా బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

గోవర్ధన మృతిపై ఆమె కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆమె స్థానికంగా ఉన్న ఒక క్లినిక్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. అయితే, ఆమె పనిచేస్తున్న క్లినిక్‌లోని ఆర్ఎంపీ డాక్టర్ ఆమెపై చేయి చేసుకున్నారని, అందరి ముందు కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైందని ఆ అవమానాన్ని భరించలేకనే ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు.

Read Also: Gachibowli fire accident: గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం

 Nurse commits suicide in Sattenapalli after being beaten by RMP doctor.

Sattenapalli Nurse Suicide: రంగంలోకి దిగిన పోలీసులు

సమాచారం అందుకున్న సత్తెనపల్లి పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ నిజంగానే ఆమెపై దాడి చేశారా? లేక ఈ ఆత్మహత్య వెనుక మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. క్లినిక్‌లోని ఇతర సిబ్బందిని కూడా విచారించే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పాలు పొంగాయని గొడవ.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్న భర్త!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha