Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్మూర్ స్కూల్‌లో ఉర్దూ వివాదం.. స్కూల్ ప్రిన్సిపాల్‌పై బీజేపీ నేతల దాడి

ఆర్మూర్ స్కూల్‌లో ఉర్దూ వివాదం.. స్కూల్ ప్రిన్సిపాల్‌పై బీజేపీ నేతల దాడి

వార్త 5 days ago

Armoor School Controversy: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిధిలోని పెర్కిట్ గ్రామంలో ఉన్న భరత్ చంద్ర హైస్కూల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హిందీ క్లాసులో విద్యార్థులకు ఉర్దూ బోధిస్తున్నారనే ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అదే సమయంలో, పాఠశాల క్యాంపస్‌లోకి అక్రమంగా చొరబడి ప్రిన్సిపాల్‌పై భౌతిక దాడికి పాల్పడినందుకు గాను బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కౌంటర్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

పాఠశాలలో ఇటీవల 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు హిందీ బోధించేందుకు హుమా హానియా అనే ఉపాధ్యాయురాలిని నియమించారు. అయితే, ఆమె హిందీ సిలబస్‌ను పక్కనబెట్టి విద్యార్థులకు ఉర్దూ అక్షరమాలను నేర్పుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనితో పాటు, క్లాసులో విద్యార్థులు ఒకరినొకరు ‘నమస్తే’ అని కాకుండా ‘ఆదాబ్’ అంటూ పలకరించుకోవాలని సదరు టీచర్ ఒత్తిడి తెచ్చినట్లు విద్యార్థుల ద్వారా ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై తల్లిదండ్రులు గతంలోనే నిరసన వ్యక్తం చేయగా, గొడవ పెద్దది కాకుండా ఉండేందుకు స్కూల్ ప్రిన్సిపాల్ అమీర్ ఖాన్, కరస్పాండెంట్ మల్లయ్యలు విద్యార్థుల నోట్‌బుక్స్‌లో ఉర్దూ రాసి ఉన్న పేజీలను చింపేసినట్లు విచారణలో తేలింది.

Read Also : TGSRTC profits: మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్.. రూ.1,059 కోట్ల లాభాల్లో TGSRTC!

 Urdu controversy at Armoor school; BJP leaders attack school principal.

Armoor School Controversy: అధికారుల విచారణ.. బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు

ఈ వ్యవహారంపై నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, మండలాధికారులు, ఆర్మూర్ ఇన్‌స్పెక్టర్ పి. సత్యనారాయణ పాఠశాలను సందర్శించి ప్రాథమిక విచారణ జరిపారు. ఆరోపణలు నిజమేనని తేలడంతో, ఆర్మూర్ తహసీల్దార్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు వివిధ వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు గాను టీచర్ హుమా హానియా, ప్రిన్సిపాల్ అమీర్ ఖాన్, కరస్పాండెంట్ మల్లయ్యలపై బీఎన్ఎస్ (BNS) యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

ప్రిన్సిపాల్‌పై బీజేపీ శ్రేణుల దాడి

ఇదిలా ఉండగా, ఆర్మూర్ టౌన్ బీజేపీ అధ్యక్షుడు మందుల బాలు తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి పాఠశాల క్యాంపస్‌లోకి దూసుకెళ్లారు. అనుమతి లేకుండా చిన్న పిల్లలకు ఉర్దూ నేర్పించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అక్కడే ఉన్న పోలీసుల సమక్షంలోనే స్కూల్ ప్రిన్సిపాల్ అమీర్ ఖాన్‌పై బీజేపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్పందిస్తూ.. అక్రమంగా చొరబడటం, ప్రిన్సిపాల్‌పై దాడి చేసినందుకు గాను బీజేపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ రెండు కేసుల్లో ప్రస్తుతానికి ఎవరినీ అరెస్ట్ చేయలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన కారు… ఐదుగురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha