Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆరోగ్యం పేరుతో అసభ్యం.. స్పాల్లో వ్యభిచార ముఠాలు గుట్టు రట్టు

ఆరోగ్యం పేరుతో అసభ్యం.. స్పాల్లో వ్యభిచార ముఠాలు గుట్టు రట్టు

వార్త 1 month ago

Visakhapatnam Crime: విశాఖ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ద్వారకా నగర్ ప్రాంతంలోని బెల్లా థాయ్ స్పా సెంటర్ వేదికగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు పక్కా సమాచారం అందింది.

దీనిపై శనివారం రాత్రి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి అసలు నిజాన్ని బయటపెట్టారు.

Read also: Hema Plywood Factory:సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం

 Police raid at Bella Thai Spa Vizag

Visakhapatnam Crime: నిర్వాహకులు, కస్టమర్లు అరెస్ట్

ఈ దాడుల్లో పోలీసులు ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడ ఇబ్బందులు పడుతున్న నలుగురు బాధితులకు విముక్తి కలిగించి వారిని రక్షణ కేంద్రాలకు తరలించారు. పట్టుబడిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ద్వారక పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించి కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు.

విచారణ ముమ్మరం చేసిన పోలీసులు

నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దంద వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్పా ముసుగులో ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదులు, ఇంటెలిజెన్స్ సమాచారంతో నగరంలోని మరిన్ని అనుమానిత కేంద్రాలపై నిఘా పెంచినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మద్యంలోకి నీళ్లు కలపలేదని బాలుడిని కాల్చి చంపిన కిరాతకుడు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha