Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్‌పై భారీ జరిమానా..ఐపీఎల్ 2027 తొలి మ్యాచ్‌కు దూరం

ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్‌పై భారీ జరిమానా..ఐపీఎల్ 2027 తొలి మ్యాచ్‌కు దూరం

వార్త 1 week ago

Tim David: ఐపీఎల్ (IPL) సీజన్ ముగింపు వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఒక ఊహించని షాక్ తగిలింది. వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచిన ఆనందంలో ఉన్న ఆర్‌సీబీకి, ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ ప్రవర్తన ఇబ్బందికరంగా మారింది.

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించినందుకు గాను అతనిపై కఠిన చర్యలు తీసుకున్నారు. టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు, ఐపీఎల్ 2027 సీజన్ మొదటి మ్యాచ్ ఆడకుండా సస్పెన్షన్ విధించారు.

 Umpire Nitin Menon Tim David

Read also: RCB Fans Celebration : ఆర్‌సీబీ విజయం తర్వాత హంగామా.. బస్సుపై రాళ్లదాడి, ట్రాఫిక్ జామ్

అసలేం జరిగింది? అంపైర్‌పై అసహనం

మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో ఈ వివాదం చోటుచేసుకుంది. గుజరాత్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ జరుగుతున్న సమయంలో ఒక క్యాచ్ రివ్యూను ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ పరిశీలించి, నాటౌట్‌గా ప్రకటించారు. అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తికి లోనైన టిమ్ డేవిడ్, కోపంతో అంపైర్ వైపు ఐస్ బ్యాగ్‌ను విసిరారు. ఈ ప్రవర్తనను ఐపీఎల్ నిబంధనావళిలోని ఆర్టికల్ 2.9 కింద తీవ్రమైన ఉల్లంఘనగా మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పరిగణించారు. టిమ్ డేవిడ్ కూడా తన తప్పును ఒప్పుకోవడంతో శిక్ష ఖరారైంది.

Tim David: సస్పెన్షన్‌కు కారణమైన ‘డీమెరిట్ పాయింట్లు’

ఈ క్రమశిక్షణా రాహిత్యానికి గాను డేవిడ్‌కు రెండు డీమెరిట్ పాయింట్లు విధించారు. దీనితో ఈ 2026 సీజన్‌లో అతని మొత్తం డీమెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక సీజన్‌లో ఒక ఆటగాడి ఖాతాలో ఐదు డీమెరిట్ పాయింట్లు చేరితే, ఆటోమేటిక్‌గా తర్వాతి సీజన్‌లోని మొదటి మ్యాచ్‌కు సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల 2027 ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కు టిమ్ డేవిడ్ దూరం కానున్నాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

కోల్‌కతాలో 70 అడుగుల మెస్సీ విగ్రహం తొలగింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha