Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్సీబీని చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్!

ఆర్సీబీని చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్!

వార్త 3 months ago

SRH vs RCB Scorecard: ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఉప్పల్ వేదికగా జరిగిన ఈ హై-స్కోరింగ్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. అనంతరం 256 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.

లక్ష్య చేధనలో విఫలమైన ఆర్‌సీబీ బ్యాటర్లు

భారీ లక్ష్య చేధనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబడింది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో రజత్ పాటిదార్ (56), వెంకటేశ్ అయ్యర్ (44) బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు.

మిగిలిన బ్యాటర్లలో దేవదూత్ పడిక్కల్ 21 పరుగులు చేయగా, ఆఖర్లో కృనాల్ పాండ్యా (39 నాటౌట్), టిమ్ డేవిడ్ (15 నాటౌట్) వేగంగా ఆడినప్పటికీ అవసరమైన రన్ రేట్ భారీగా ఉండటంతో జట్టును గెలిపించలేకపోయారు. దీంతో ఆర్‌సీబీ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 200 పరుగుల వద్దే ఆగిపోయింది.

 Hyderabad Secures Massive Victory Over Bangalore; RCB Defeated by 55 Runs!

SRH vs RCB Scorecard: నియంత్రించిన హైదరాబాద్ బౌలర్లు

హైదరాబాద్ బౌలర్లు క్రమశిక్షణతో కూడిన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఆర్‌సీబీ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ అద్భుతమైన స్పెల్‌తో 2 వికెట్లు పడగొట్టగా.. సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్ చెరో వికెట్ తీసి జట్టు విజయానికి సహకరించారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో తమ పటిష్టమైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

హైదరాబాద్ బ్యాటర్ల తుఫాన్.. ఆర్సీబీ ముందు 256 పరుగుల లక్ష్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha