Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్థిక విధానాలపై ఆత్మపరిశీలన?

ఆర్థిక విధానాలపై ఆత్మపరిశీలన?

వార్త 3 months ago

Economic policies : చాలా రోజుల తర్వాత కలిసిన మిత్రుడిని పరామ ర్శిస్తూ ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు అని అడి గాడట ఒక పెద్ద మనిషి, నాకేంటి హాయిగా సొంత ఊర్లో కడుపులో చల్ల కదలకుండా వ్యవసాయం చేస్తున్నానని జవాబు ఇవ్వడంతో, ఎన్ని నాగళ్ల వ్యవసాయమని ప్రశ్నిం చాడట.

నాది మా పటేల్గా కలిస్తే వంద నాగళ్ల వ్యవసాయ మని రకమని జవాబు చెప్పాడట. కానీ ఆయన వేషభాష లో, వ్యవహార తీరు చూస్తే ఆ స్థాయిలో ఉన్నట్లు కన్పిం చకపోవడంతో ఆ వంద అరకలకు సంబంధించి రెండు వందల ఎడ్లలో నీవెన్ని ఎడ్లంటే ‘ దొడ్లో కాలు విరిగిన ఎద్దులేస్తే, దొంగలు కొట్టుకుపోయిన ఎద్దు దొరికితే, అత్త వారింటి నుంచి వారు ఇస్తామన్న ఎద్దును తోలుకువస్తే, షావుకారు ఎద్దు కొనుగోలుకు ఇస్తానన్న అప్పు ఇస్తే నావి నాలుగెడ్లు అవుతాయన్నాడట. అంటే ఆయన వద్ద ఉన్నది ఒకే ఒక ఎద్దు. అది కూడా కాలువిరిగి దొడ్లో పడి ఉంది. ఆయన చెప్పుకుంటున్నది మాత్రం రెండువందల ఎడ్లతో వ్యవసాయం చేస్తున్నట్లు. ఇలానే ఉంది దేశంలోని అనేక రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి. ఖజానాలో నిధులు నిల్వలేవు. ఉద్యోగుల జీతభత్యాలు నెలనెలా చెల్లించడం కోసం వెతు కులాడుకోవల్సి వస్తుంది. నిత్యం రుణాల వేటలో చాలా రాష్ట్రాలు మునిగి తేలుతున్నాయి.

 Economic policies

Economic policies : ఒక పద్ధతి, విధి విధానాలుండాలి

తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. అభివృద్ధిచేయాలంటే అప్పులు చేయాల్సిందే. అందులో మరో అభిప్రాయానికి తావులేదు. కానీ దానికి ఒక పద్ధతి, విధి విధానాలుండాలి. తీర్చే మార్గాలు ఆలోచించాలి. అవేమీ పట్టించుకోకుండా అప్పు దొరకడమే ఎంతో అదృష్టంగా భావిస్తూ అప్పుల వేటలో నిత్యం అన్వేషణలో ఉండడం ఏమాత్రం సమంజ సం కాదు. శక్తికి మించిన సహకారం కానీ, సహాయం కానీ చివరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం అంత మంచిది కాదు. మోయలేని భారం తలకెత్తుకుంటే మొదటికే మోసం వస్తుందన్న విషయం విస్మరించకూడదు. ఏదో ఒకటి, రెండు సందర్భాల్లో అయితే అర్ధంచేసుకోవచ్చు, అభినందించవచ్చు. కానీ అదే పనిగా ఆర్ధిక పరిస్థితి అర్థం చేసుకోకుండా అందిన కాడికి అప్పులు తెచ్చి ఖర్చుపెడితే అది వ్యక్తికి కానీ, సంస్థకు కానీ, ప్రభుత్వానికి కానీ ఒక నాటికి చేతులు ఎత్తకతప్పదు. దివాలా బాటపట్టక తప్పదు. ఇదేమీ కొత్త విషయం కాదు. అందరికి తెలిసిందే. ఎన్నో సంస్థలు, వ్యక్తులు, చివరకు ప్రభుత్వాలకు కూడా ఒకనాడు ఎంతో దేదీప్యమానంగా వెలుగొంది ఆ బాటలో నడిచి పతనావస్థకు చేరుకున్న ఉదాహరణలు కోకొల్లలు. ప్రపంచం లో ఎన్నోదేశాలు అవగాహన, భవిష్యత్ దృష్టిలేని నిర్ణయా లతో అతలాకుతలమై పతనం అంచుకు చేరుకున్న విషయం తెలియందేమికాదు.

అప్పుల మీద అప్పులు

పొరుగునున్న శ్రీలంకను తాజాగా ఉదహ రించవచ్చు. ఇప్పటికీ ఆ దేశం ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకో లేకపోతున్నది. భారత్లో ఎన్నో రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని ఆర్థిక నిపుణులు ఎంతో కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. డబుల్ ఇంజన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర పెద్దల సహాయ సహకారాలతోకొంత మేరకు ఆర్థికపరిస్థితి మెరుగ్గాకన్పిస్తున్నా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నదేమో ననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల మీద అప్పులు తెచ్చుకుంటున్నారు. ఇష్టానుసారంగా కార్యక్రమా లకు వెచ్చిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పులు డెబ్భైవేల కోట్లరూపాయలలోపలే ఉంటే ఆతర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు, ఇతర సంక్షేమ కార్యక్ర మాలకు వెచ్చించిన నిధులతో దాదాపు ఏడెనిమిది లక్షల కోట్లకు పైగా పెరిగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలు వడ్డీలతో సహా, తాముఎన్నికల్లో ప్రకటించిన హామీలను పూర్తి చేసేం దుకు కొత్తగా అప్పులుచేయాల్సి వస్తున్నది. చేసిన అప్పు లకు ఏటా ముప్ఫయ్ వేలకోట్ల రూపాయలకు పైగా వడ్డీయే చెల్లిస్తున్నారు. ఆదాయానికి వ్యయానికి మధ్య నెలకుదాదాపు రెండు వేల రెండువందల కోట్లరూపాయలకు లోటు ఉంటు న్నదని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

నిధుల కొరత

పాతపథకాలు రద్దుచేసే పరిస్థితి లేదు. తాము ఎన్నికల్లో ప్రకటించిన పథ కాలు అమలు చేయాలంటే నిధుల కొరత, దీంతో అందర్ని సంతృప్తి పరిచేందుకు విత్త మంత్రి పడుతున్న ఇబ్బందులు, చేస్తున్న విన్యాసాలు అన్నీఇన్నీ కావు. ప్రతీ అవసరానికి అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. జీతభత్యాలకే కాదు సంక్షేమకార్యక్రమాలకు, ఇతర నిర్మాణా త్మక పనులకు నిధులు వెతుక్కోవాల్సిన వరిస్థితులుఏర్పడు తున్నాయి. పెట్టను కొట్టా పొయ్యిలో పెట్ట’ అన్నట్లుగా ఉంది ఆర్థికపరిస్థితి. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపో వడంతో చాలాప్రాంతాల్లో కాంట్రాక్టర్లు పనులునిలిపి వేశారు, మరికొన్ని ప్రాంతాల్లో పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఆలస్యం అయ్యేకొద్దీ వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఆ భార మంతా ప్రభుత్వం మీద పడుతుంది. సంక్షేమ కార్యక్ర మాలు చేపట్టాల్సిందే. దారిద్య్ర్యరేఖకు దిగువన ఉన్నలక్షలాది బలహీన వర్గాలకు చేయూతనివ్వాల్సిందే. వారికి అన్నిరకాల సహకారాలు అందించాల్సిందే. ప్రజాస్వామ్యవాదులుఎవరూ దీనిని వ్యతిరేకించలేరు కూడా. కానీ వారి పేరు మీద జరుగుతున్న దోపిడీ మాటేమిటి? వారిని చూపి అన ర్హులకు వందలాది కోట్లు అప్పగించడం ఎంతవరకు సమంజసం? అవినీతి, అభివృద్ధి కలిసి పయనించలేవు. అభివృద్ధి ముందుకు నడుపుతుంటే అవినీతి వెనక్కి గుంజుతుంటుం ది. కానీ ఎక్కడ అభివృద్ధిఉంటుందో అక్కడే అవినీతి ఉం టుంది. వేలాది కోట్ల రూపాయలను వడ్డీకి తెచ్చుకుంటున్న డబ్బును ఇలాదుర్వినియోగం చేయడం ఎంతవరకు న్యాయ మో పాలకులు ఒక్కసారి ఆలోచించాలి. ప్రజాసేవ కోసమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనట్లుగా చెప్పుకుంటున్న కొందరు నేతలు వర్సెంటేజీలు బాహాటంగా తీసుకుంటున్నారు. బహి రంగంగానే చర్చ జరుగుతున్నది.

 Economic policies

రాజకీయ ప్రయోజనాల కోసం

ఇక కీలక పదవుల్లో ఉన్న కొందరు అధికారుల అవినీతి అదుపు లేకుండాపోతున్నది. ఇటీవల అవినీతి నిరోధక శాఖ చేస్తున్న దాడుల్లో వందలాది కోట్లవిలువైన ఆదాయానికి మించిన ఆస్తులు వెలుగు చూస్తు న్నాయి. మొన్న బుధవారం పట్టుబడ్డ ఓ అధికారి రెండు వందల కోట్ల రూపాయల అక్రమార్జనను ఏసిబి అధికారులు కనుగొన్నారు. ఆ విభాగంలో ఎంతో మంది పై అధికారులు ఉంటారు. వాళ్లందరి కళ్లుగప్పి ఇన్ని కోట్ల రూ పాయలు ఆక్ర మార్జనను ఎలాకూడగట్టగలిగాడో ఒక్కసారి ఆలోచించాలి. ఆ అధికారగణం ఏం చేస్తున్నట్లు? ఈ ఒక్క అధికారే కాదు ఏ విభాగం అధికారిపై ఆకస్మిక తనిఖీలు చేసినా వందల కోట్ల అక్రమార్జన ఆస్తులు బయటపడుతున్నాయి. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక పైకి ఎన్ని చెప్పుకుం టున్నా మరెంతో గంభీరంగా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక ఇబ్బందులు ఏనాడో ఆరంభమయ్యాయి. ప్రభుత్వాలు ప్రక టించిన పథకాలు, ప్రాజెక్టులు పూర్తిచేయాలంటే ఎన్ని లక్షల కోట్లు అవసరం అవుతాయో ఆర్ధికనిపుణులే చెప్పలేకపోతు న్నారు. ఆ స్థాయిలో నిధులు సమకూర్చుకోగలుగుతారు? అప్పులు తేవడం, పన్నులు వేయడం తప్ప మరో మార్గం లేదు. ఇప్పటికే ప్రభుత్వం పెంచిన పన్నులు ప్రజా జీవితా న్ని దుర్భరం చేస్తున్నాయి. ఇక అప్పులే మార్గం. ఇప్పటికే లక్షలాది కోట్లు అప్పుల్లో ఉన్నాం. వెయ్యి, రెండువేల కోట్ల చేబదుళ్లకు వెతుకులాడాల్సిన పరిస్థితుల్లో లక్షలాది కోట్లు సమకూర్చుకోవడం అంటే మాటలు కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రవేశపెడుతున్న పథకాల విషయంలో పాలకులు మనసుపెట్టి ఆలోచించాలి. ప్రభుత్వానికి ఆదా యం తెచ్చిపెట్టే ముఖ్యమైన ప్రభుత్వ శాఖల్లో నిజాయితీ పరులైన అధికారులను, సమర్థులను నియమించి కట్టుదిట్టం చేస్తేరెవెన్యూ రాబడి మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ కోణంలో రాజకీయాలకు అతీతంగా కృషి జరగాలి. అప్పులు చేయడం కంటే అనవసరపు ఖర్చులు తగ్గించుకొని నిర్మాణాత్మకాభి వృద్ధి కార్యక్రమాలు చేపడితే తప్ప ఎన్నివేల కోట్ల రూపా యలు అప్పు తెచ్చినా, మరెన్నివేల కోట్ల రూపాయలు పన్ను లు రూపంలో ప్రజలపై భారం మోపినా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు కన్పించడం లేదు.

-దామెర్ల సాయిబాబ

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

హైదరాబాద్‌లో తగ్గిన పసిడి రేట్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha