Jeedimetla Depot Accident: హైదరాబాద్ మేడ్చల్ జిల్లా పరిధిలోని జీడిమెట్ల ఆర్టీసీ (TGRTC) బస్ డిపోలో తీవ్ర విషాదకర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కింద ఉండి మరమ్మతులు (Repair) చేస్తున్న ఓ మెకానిక్, అదే బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ హృదయవిదారక ఘటనతో డిపో ప్రాంగణంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Read Also:Nirmal: చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

ప్రమాదం జరిగిన తీరు
జీడిమెట్ల డిపోలో మెకానిక్‌గా విధులు నిర్వహిస్తున్న సంతోష్ కుమార్ (39), బ్రేకుల్లో సాంకేతిక సమస్య తలెత్తిన ఒక ఆర్టీసీ బస్సును సరిచేసేందుకు దాన్ని కిందకు వెళ్లారు. సంతోష్ కుమార్ బస్సు కింద ఉండి పని చేస్తున్నారనే విషయాన్ని గమనించని డ్రైవర్, ఒక్కసారిగా బస్సును ముందుకు కదిపారు. దీంతో తీవ్రమైన ఒత్తిడికి గురై, బస్సు భారీ చక్రాల కింద నలిగిపోయిన సంతోష్ కుమార్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే కన్నుమూశారు.
Jeedimetla Depot Accident: కేసు నమోదు – పోలీసుల దర్యాప్తు
ప్రమాదంపై సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు తక్షణమే డిపో వద్దకు చేరుకుని పరిశీలించారు. అనంతరం భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.డ్రైవర్ నిర్లక్ష్యం మరియు కమ్యూనికేషన్ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిత్యం తమతో కలసి పనిచేసే తోటి ఉద్యోగి కళ్ల ముందే దారుణంగా చనిపోవడంతో డిపోలోని తోటి కార్మికులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Epaper: epaper.vaartha.com
గుజరాత్‌లో దారుణం: ర్యాగింగ్ వేధింపులు తాళలేక జూనియర్ డాక్టర్ ఆత్మహత్య - నలుగురు సీనియర్లు సస్పెండ్

