Telangana RTC Strike: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
జేఏసీ (JAC) నాయకులతో చర్చలు జరిపేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. రేపటి (ఏప్రిల్ 22) నుండి తలపెట్టిన నిరవధిక సమ్మెను నివారించడమే లక్ష్యంగా ఈ చర్చలు జరగనున్నాయి.
Read also: TGRTC Strike 2026: నిలిచిపోనున్న ఆర్టీసీ చక్రం..గ్రేటర్ హైదరాబాద్‌లో 3,800 బస్సులు బంద్
Telangana RTC Strike: Excitement over RTC strike.. Management calls JAC leaders for talks!
అధికారుల ఫోన్ కాల్: చర్చలకు గ్రీన్ సిగ్నల్
సమ్మె నోటీసు ఇచ్చినప్పటి నుండి సందిగ్ధంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED) వెంకన్న, ఆర్టీసీ సీపీఎం ఉషాదేవి స్వయంగా రంగంలోకి దిగారు. వారు జేఏసీ నాయకులకు ఫోన్ చేసి చర్చలకు ఆహ్వానించారు. కార్మికుల ప్రధాన డిమాండ్లు, సంస్థ ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక సవాళ్లపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించనున్నారు.
Telangana RTC Strike: ప్రధాన డిమాండ్లు ఇవే
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 2021, 2025 వేతన సవరణ (PRC) అమలు చేయడం, బకాయి ఉన్న పీఎఫ్, సీసీఎస్ నిధుల చెల్లింపు వంటి మొత్తం 32 డిమాండ్లతో జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. చర్చలకు సంబంధించిన ఖచ్చితమైన సమయం, వేదికను అధికారులు మరికొద్ది సేపట్లో ప్రకటించనున్నారు. ఈ చర్చలు సఫలమైతే సమ్మె విరమించే అవకాశం ఉంది, లేనిపక్షంలో బుధవారం తెల్లవారుజాము నుండే బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
నేటి అర్థరాత్రి నుండి రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు: ఆర్టీసీ జేఏసీ చైర్మన్

