Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసక్తి గా మారిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. మరో పదవిపై కీలక చర్చలు?

ఆసక్తి గా మారిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. మరో పదవిపై కీలక చర్చలు?

వార్త 2 months ago

Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రాజకీయంగా అత్యంత ఆసక్తికరంగా మారింది. హస్తినలోని భారత్‌ మండపంలో నిర్వహించే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు.

చంద్రబాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కీలక సమావేశంలో పాల్గొనడం విశేషం. బుధవారం ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో భాగస్వామి అవుతారు. అనంతరం బుధవారం రాత్రికి ఆయన ఢిల్లీలోనే బస చేస్తారు.

Read Also : AP Aqua Farmers: ఆక్వా రైతులకు శుభవార్త.. రూ.1.50కే విద్యుత్

 Chandrababu’s Delhi visit sparks interest… Crucial talks regarding another post?

Chandrababu Delhi Tour: నీతి ఆయోగ్‌ 11వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం

ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం చంద్రబాబు నాయుడు మరో కీలక సమావేశానికి హాజరుకానున్నారు. రాష్ట్రపతి భవన్‌లో గురువారం ఉదయం 9:15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న నీతి ఆయోగ్‌ 11వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర నిధుల కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత గురువారం రాత్రి 9 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి ఆయన అమరావతికి చేరుకుంటారు.

కేంద్ర మంత్రివర్గ విస్తరణపై జోరుగా చర్చలు

చంద్రబాబు ఢిల్లీ పర్యటన కేవలం అధికారిక సమావేశాలకే పరిమితం కాకుండా, రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్‌లో ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఏపీకి మరో కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కించుకునే అంశంపై కూడా ఈ పర్యటనలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ప్రధానిగా మోదీ రికార్డ్…చంద్రబాబు, నారా లోకేశ్ ప్రత్యేక శుభాకాంక్షలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha