Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆశా భోస్లే ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన మనవరాలు

ఆశా భోస్లే ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన మనవరాలు

వార్త 2 months ago

Asha Bhosle Health Update: భారతీయ సంగీత శిఖరం, పద్మవిభూషణ్ గ్రహీత ఆశా భోస్లే (92) అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు.

ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఆమెకు ఐసీయూలో చికిత్స అందుతోంది.

Read Also:John Nolan: సీనియర్ నటుడు జాన్ నోలన్ కన్నుమూత!

Asha Bhosle Health Update: మనవరాలు జానై భోస్లే స్పందన

ఆశా భోస్లే ఆరోగ్య పరిస్థితిపై ఆమె మనవరాలు జానై భోస్లే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'అమ్మమ్మ ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది, ఆమె త్వరలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నాము. ఈ సమయంలో మా ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని కోరుతున్నాము' అని జానై పేర్కొన్నారు.

భారత సినీ సంగీత ప్రపంచంలో ఆశా భోంస్లే ఒక శిఖరం లాంటివారు. 1943లో మరాఠీ చిత్రం 'మాఝా బల్'తో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె, 1948లో హిందీ చిత్రం 'చునరియా'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో హిందీతో పాటు 20కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో దాదాపు 12,000కు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. ఆర్.డి. బర్మన్, ఇళయరాజా, ఏ.ఆర్. రెహమాన్ వంటి ఎందరో ప్రముఖ సంగీత దర్శకులతో ఆమె పనిచేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha