Revanth Reddy:కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 5:45 గంటలకు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొత్తారి గ్రామానికి సిఎం చేరుకోనున్నారు.
కొత్తారి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరణ చేస్తారు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు.
Read also: Husnabad Municipal Politics: హుస్నాబాద్ లో ఏబీసీడీ రాజకీయం..కౌన్సిలర్లు సైడ్‌లైనేనా..?
CM Revanth Reddy Asifabad Tour visit.
Revanth Reddy:ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
కొత్తరి గ్రామం నుంచి రోడ్డు మార్గంలో 7 గంటలకు కాగజ్ నగర్ ఎక్స్ రోడ్స్క సిఎం చేరుకోనున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత కాగజ్నగర్ ఎక్స్ రోడ్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం కాగజ్నగర్ నుంచి మంచిర్యాలకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసంకు చేరుకుంటారు. రాత్రి 10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

