Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసియా బాక్సింగ్‌లో సెమీస్‌కు నిఖత్ జరీన్..

ఆసియా బాక్సింగ్‌లో సెమీస్‌కు నిఖత్ జరీన్..

వార్త 2 months ago

Nikhat Zareen: మంగోలియాలోని ఉలన్‌బాతర్‌లో జరుగుతున్న ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ (2026) లో భారత మహిళా బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు.

ఐదో రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సహా ప్రియా, ప్రీతి పవార్ సెమిస్ కి చేరి, దేశానికి మూడు పతకాలు ఖాయం చేశారు. .ఫిలిప్పీన్స్‌కు చెందిన జియాన్ బగుహిన్‌తో జరిగిన మ్యాచ్‌లో నిఖత్ ఆది నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. రిఫరీ స్టాప్ కాంటెస్ట్ (RSC) ద్వారా నిఖత్‌ను విజేతగా ప్రకటించారు.

Read Also:Ashish Nehra-Vaibhav: గుజరాత్ కోచ్ నెహ్రా కాళ్లకు మొక్కిన వైభవ్

 Nikhat Zareen Semifinals Asia Boxing 2026

Nikhat Zareen: నిఖత్ జరీన్ ‘నాకౌట్’ విజయం

మహిళల 51 కిలోల క్యాటగిరీ క్వార్టర్‌ బౌట్‌లో ఆదినుంచే పూర్తి నియంత్రణతో ఆడిన నిఖత్‌.. రిఫరీ స్టాప్‌ కాంటెస్ట్‌ (ఆర్‌ఎఫ్‌సీ)తో ఫిలిప్పీన్స్‌కు చెందిన జియాన్‌ బగుహిన్‌ను ఓడించి సెమీస్‌ చేరింది.సెమీస్‌లో.. 2024 ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన వు యు (చైనా)తో అమీతుమీ తేల్చుకోనుంది. మహిళల 60 కిలోల విభాగంలో ప్రియ.. 4-1తో చెంగ్యు యాంగ్‌ (చైనా)ను చిత్తుచేసింది. ఫైనల్‌ బెర్తు కోసం ఆమె సెమీస్‌లో నమున్‌ మొంఖొర్‌ (మంగోలియా)తో తలపడుతుంది. 54 కేజీల క్యాటగిరీలో వరల్డ్‌ బాక్సింగ్‌ కప్‌ స్వర్ణ విజేత ప్రీతి.. 5-0తో మంగున్‌ సెత్సెగ్‌ (మంగోలియా)ను మట్టికరిపించి సెమీస్‌కు అర్హత సాధించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సంజూ శాంసన్ ఫామ్‌పై స్టీఫెన్ ఫ్లెమింగ్ క్లారిటీ.. విమర్శలకు చెక్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha