Dailyhunt
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

వార్త 3 weeks ago

David Warner Arrested: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డారు. మద్యం మత్తులో వాహనం నడిపినందుకు (డ్రంక్ అండ్ డ్రైవ్) సిడ్నీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

ఈ ఘటన క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

Read Also:IPL 2026: ఉప్పల్ స్టేడియంలో డిజిటల్ టికెటింగ్ అమలు.. ఏప్రిల్ 13 నుంచి అమల్లోకి!

 Australian cricketer David Warner arrested

వచ్చే నెలలో కోర్టుకు హాజరుకావాలని ఆదేశం

సిడ్నీలో వాహనాల తనిఖీ చేపట్టిన క్రమంలో వార్నర్ పట్టుబడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. అయితే, వచ్చే నెలలో ఈ కేసుకు సంబంధించి కోర్టులో హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే ఆస్ట్రేలియా క్రికెటర్లలో ఒకరైన వార్నర్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది.

పీఎస్ఎల్ (PSL) ఆడుతుండగానే ఘటన

వార్నర్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) లో కరాచీ కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లీగ్ మధ్యలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ పరిణామం ఆయన కెరీర్‌పై మరియు లీగ్‌లో ఆయన కొనసాగింపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. గాయంతో మిచెల్ స్టార్క్ దూరం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha