Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్ట్రేలియాలో ఎర్రగా మారిన ఆకాశం ..ప్రజల్లో భయం!

ఆస్ట్రేలియాలో ఎర్రగా మారిన ఆకాశం ..ప్రజల్లో భయం!

వార్త 2 months ago

ప్రకృతిలో ఆకస్మికంగా తలెత్తే అనూహ్య మార్పులు ఒక్కోసారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుంటాయి. ఆకస్మికంగా విరుచకపడే భూకంపాలు, సునామీలు, పిడుగుల జడివానల సంకేతాలను అభివృద్ది చెందిన శాస్త్రీయ విజ్ఞానం తో ముందే పసిగట్టేస్తుండటంతో మనుషులు వాటిని ఎదుర్కోవడంలో కొంత సంసిద్దమవుతూ ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించుకోగలుగుతున్నారు.

అయితే అనూహ్యంగా వాతావారణం మారిపోయి..ఒక్కసారిగా ఆకాశం అంతా ఎర్రగా మారిపోయి..రక్త వర్ణంతో భయపెడితే..ఏం జరుగబోతుందో తెలియక జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ భయంకర, అద్భుత, అశ్చర్యకర ఘటన ఆస్ట్రేలియా(Australia) లోని డెన్ హామ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Read Also: KitKat theft: 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్ల భారీ దొంగతనం.. ఎక్కడంటే?

 Red Sky incident

Red Sky incident: స్థానిక ప్రజల్లో భయాందోళనలు

వాతావరణ మార్పులను అనుసరించి ఆకాశం ఒక్కోసారి నీలం, తెలుపు, నలుపు రంగుల్లో కనిపించడం సహజం. అందుకు భిన్నంగా ఒక్కసారిగా ఆకాశం అంతా ఎర్రటి రంగులోకి మారడంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అకాశం ఎందుకు ఎర్రబడిందో అర్ధం కాక..ఏ ప్రకృతి వైపరిత్యం ముంచుకోస్తుందోనన్న భయంతో అక్కడి ప్రజలు వణికిపోయారు. ఇది సహజ ప్రకృతి వైవిధ్యంగా కనిపించినప్పటికి .. చూసే వారికి మాత్రం భయానక అనుభూతి మిగిల్చింది. ఇలా అప్పుడప్పుడు ప్రకృతి అద్భుతాలు సృష్టించే వాతావరణ మార్పుల వెనుక శాస్త్రీయమైన కారణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఈవీ సంస్థలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha