Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్తులపై విచారణకు సిద్ధమేనా? సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌

ఆస్తులపై విచారణకు సిద్ధమేనా? సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌

వార్త 3 weeks ago

KTR: తెలంగాణ రాజకీయాల్లో ఆస్తుల వివాదం మరోసారి రాజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

తమ కుటుంబ ఆస్తులతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై కూడా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. ఒకవేళ ఈ విచారణలో తమ కుటుంబం తప్పు చేసినట్లు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఎన్నికల అఫిడవిట్లలో స్పష్టంగా పేర్కొన్నట్లు కేటీఆర్ వెల్లడి

సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తమ కుటుంబ ఆస్తులను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌పై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసలు వ్యాపారం చేయడం నేరమా? అని ఆయన ప్రశ్నించారు. తాను 2006లోనే హోటల్ వ్యాపారాన్ని ప్రారంభించానని, ప్రస్తుతం తమకు మూడు హోటళ్లు ఉన్నాయని తెలిపారు. తమ ఆస్తులకు సంబంధించిన ప్రతి వివరాలను ఎన్నికల సమయాల్లో సమర్పించిన అఫిడవిట్లలో స్పష్టంగా వెల్లడించామని కేటీఆర్ గుర్తుచేశారు.

KTR: చేనేత కార్మికుల సమస్యలను విస్మరించిన సీఎం: కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

సిరిసిల్లలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. స్థానిక చేనేత కార్మికుల సమస్యలను పూర్తిగా పట్టించుకోలేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 35 మంది చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకుంటారని, కనీసం రూ.10 లక్షల పరిహారం ప్రకటిస్తారని తాము ఎంతో ఆశించామని తెలిపారు. కానీ, ముఖ్యమంత్రి తన పర్యటనలో కేవలం రాజకీయ విమర్శలు చేయడానికే పరిమితమయ్యారని ఆయన మండిపడ్డారు.

ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కుట్ర:

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలును తాము నిలదీస్తున్నందుకే, తమ కుటుంబంపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి రాజకీయ వ్యూహాలకు తెరలేపారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రజా సమస్యలపై పోరాటం ఎప్పటికీ ఆగదని కేటీఆర్ తేల్చిచెప్పారు.

కేటీఆర్‌ను అరెస్ట్ చేయండి.. సీఎం రేవంత్‌కు ఎంపీ రఘునందన్ రావు సవాల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha