Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసుపత్రి భవనంపై నుంచి దూకి కిడ్నీ రోగి ఆత్మహత్య!

ఆసుపత్రి భవనంపై నుంచి దూకి కిడ్నీ రోగి ఆత్మహత్య!

వార్త 2 weeks ago

Guntur GGH Suicide: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చెన్నంశెట్టి శ్రీనివాస్ అనే రోగి ఆసుపత్రి భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఈ నెల 23వ తేదీన చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన శ్రీనివాస్.. శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకుంటానని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత తీవ్ర మనస్తాపంతో భవనం పైనుంచి కిందకు దూకేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Read Also: Supreme Court Refuses : అవిముక్తేశ్వరానంద్‌కు ముందస్తు బెయిల్ వ్యవహారంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ!

 Kidney patient commits suicide by jumping from hospital building!

Guntur GGH Suicide: తాపీ మేస్త్రీ జీవితంలో తీరని విషాదం

మృతుడు పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ వృత్తిరీత్యా తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. కొంతకాలం క్రితమే అతని భార్య కూడా మరణించినట్లు సమాచారం. అటు భార్య వియోగం, ఇటు తీవ్రమైన కిడ్నీ వ్యాధి తెచ్చిపెట్టిన శారీరక, ఆర్థిక ఇబ్బందుల వల్లే మనస్తాపానికి గురై ఆయన ఈ ఘోరానికి పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కల్తీ లిక్కర్ తాగి 15 మందికి పైగా మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha