Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆవర్తన ప్రభావంతో భారీ వర్ష సూచన - IMD

ఆవర్తన ప్రభావంతో భారీ వర్ష సూచన - IMD

వార్త 3 days ago

Weather updates:బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. రాగల మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఈ వాతావరణ మార్పుల వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Read also: El Nino effect: సుర్రుమంటున్న ఎండలు.. వచ్చే 2 రోజులు జాగ్రత్త!

 Heavy rain forecast due to cyclonic circulation.

ఎక్కడెక్కడ వర్షాలు అంటే

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమలో గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Weather updates:ప్రజలకు ముఖ్య సూచనలు

రైతులు వ్యవసాయ పనుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. ఎవరూ చెట్ల కింద అలాగే విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడవద్దని హెచ్చరించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని సూచనలు చేయడం జరిగింది.

Epaper: epaper.vaartha.com

మండిపోతున్న ఎండలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha