Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆయిల్ మార్కెట్‌లో భారత్ మైండ్ గేమ్.. ఏమిటా ప్లాన్?

ఆయిల్ మార్కెట్‌లో భారత్ మైండ్ గేమ్.. ఏమిటా ప్లాన్?

వార్త 2 days ago

Global oil market: ఇప్పటి వరకు చమురు అవసరాల కోసం విదేశాలపై అధికంగా ఆధారపడిన భారత్.. ఇకపై ఇంధన భద్రత విషయంలో మరింత బలపడే దిశగా అడుగులు వేస్తోంది.

గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడల్లా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతాయనే ఆందోళన ఉండేది. కానీ, ఇకపై ఆ సీన్ పూర్తిగా మారబోతోంది. భారతదేశం కేవలం ఒక కొనుగోలుదారుడిలా కాకుండా, గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌ను శాసించే స్థాయికి ఎదుగుతోంది. యూఏఈ (UAE) తో కుదుర్చుకున్న ఒక భారీ వ్యూహాత్మక ఒప్పందం దీనికి ప్రధాన కారణం. దీనివల్ల భారత్ రిస్క్ జోన్ నుండి గ్లోబల్ మార్కెట్‌పై అదుపు సాధించే లీవరేజ్ స్థానానికి చేరుకుంటోంది.

Read also: iPhone 17 Pro Max Discount: ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు

 India’s ‘mind game’ in the oil market-what is the plan?

Global oil market: ఐదింతలు పెరగనున్న అండర్ గ్రౌండ్ స్టోరేజ్!

ఈ మెగా ప్లాన్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటంటే.. యూఏఈ కి చెందిన ప్రముఖ ‘అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ’ (ADNOC) మన దేశంలో తన చమురు నిల్వలను ఏకంగా 30 మిలియన్ బారెల్స్‌కు పెంచబోతోంది. ప్రస్తుతం మన దేశంలో విశాఖపట్నం, మంగళూరు, పడూరు లలో ఉన్న అండర్ గ్రౌండ్ స్టోరేజ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంది. కానీ తాజా డీల్‌తో ఈ నిల్వ సామర్థ్యం దాదాపు ఐదింతలు పెరుగుతుంది. దీనివల్ల వచ్చే అతిపెద్ద లాభం ఏంటంటే.. అత్యవసర పరిస్థితుల్లో ఈ చమురును దేశీయ అవసరాలకు వాడుకోవడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో అనుకూల సమయం చూసి వేరే దేశాలకు అమ్ముకునే (కమర్షియల్) సదుపాయం కూడా భారత్‌కు లభిస్తుంది.

పెరగనున్న భారత్ బలం

ఈ ఒప్పందం కేవలం ఒక సాధారణ వ్యాపారం మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై భారత్ ఆడుతున్న ఒక పెద్ద మైండ్ గేమ్. మన దేశంలో భారీగా ఆయిల్ నిల్వలు అందుబాటులో ఉండటం వల్ల, గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలను మనం కూడా ప్రభావితం చేయవచ్చు. భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్‌లో ఏదైనా యుద్ధం వచ్చి చమురు సరఫరా ఆగిపోయినా, మన దగ్గర ఉన్న భారీ స్టాక్‌తో దేశాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు. అంతేకాదు, ఇతర ఆయిల్ ఎగుమతి చేసే దేశాలు మనకు తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ ఇచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో బేరసారాలు ఆడే (Bargaining Power) అపారమైన సత్తా భారత్‌కు సొంతమవుతుంది.

వంటగ్యాస్ (LPG) సెక్యూరిటీ

ఈ వ్యూహంలో మరో అద్భుతమైన అంశం ‘ఫుజైరా’ అడ్వాంటేజ్. యూఏఈ లోని ప్రపంచ ప్రసిద్ధ ‘ఫుజైరా’ ఆయిల్ హబ్‌లో కూడా భారత్ తన చమురు నిల్వలను ఉంచుకునే సువర్ణ అవకాశం రాబోతోంది. ఇది అంతర్జాతీయంగా అత్యంత ఉద్రిక్తతలతో కూడిన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధికి వెలుపల ఉండటం వల్ల, అక్కడ ఎలాంటి యుద్ధాలు జరిగినా మన ఆయిల్ సప్లైకి ఎలాంటి ఢోకా ఉండదు.

కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా.. దేశంలో వంటగ్యాస్ (LPG), సహజ వాయువు (LNG) నిల్వలను కూడా భారీగా పెంచేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ఇప్పటికే యూఏఈ తో 14 ఏళ్ల సుదీర్ఘ సరఫరా ఒప్పందం చేసుకుంది. దీనివల్ల దేశంలోని కోట్ల కుటుంబాలకు వంటగ్యాస్ కొరత లేకుండా చూసుకోవచ్చు. ఇప్పటివరకు ఆయిల్ విషయంలో ఎప్పుడూ డిఫెన్స్‌లోనే ఉంటూ ధరలు పెరిగితే తల ఊపడం తప్ప ఏమీ చేయలేని స్థితి నుండి, ఈ సరికొత్త వ్యూహాత్మక అడుగుతో భారత్ గ్లోబల్ మార్కెట్‌లో ఒక ‘యాక్టివ్ ప్లేయర్’గా అవతరిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

క్రెడిట్ కార్డు బిల్లు EMIలో కడుతున్నారా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha