Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించిన ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు

ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించిన ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు

వార్త 2 weeks ago

Oil Palm Cultivation: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ (IIOPR), పెదవేగి వారి సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రం (KVK), రాస్తకుంటుబాయి ఆధ్వర్యంలో బొబ్బిలి ఉద్యాన ఫారం (nursery) లో గురువారం ఆయిల్ పామ్ సాగుపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి అఖిల భారతీయ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్ , పెదవేగి నుంచి వచ్చిన ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.వి. ప్రసాద్ గారు (అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్), డాక్టర్ కళ్యాణ్ బాబు గారు (అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Read Also : CM Revanth Reddy : "ఓటు లేకపోతే పథకాలూ రావు": ఎస్‌ఐఆర్‌ (SIR) ఓటరు ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

 IIOPR scientists created awareness among farmers about oil palm cultivation.

Oil Palm Cultivation: యాజమాన్య పద్ధతులు, దిగుబడులపై ప్రసాద్ గారి సూచనలు

ఈ సందర్భంగా డాక్టర్ ఎం.వి. ప్రసాద్ గారు మాట్లాడుతూ ఆయిల్ పామ్ రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు నాణ్యమైన మొక్కల ఎంపిక, శాస్త్రీయ నాటే విధానాలు, ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణ, అంతర పంటల సాగు మరియు సమగ్ర సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు. అనంతరం డాక్టర్ కళ్యాణ్ బాబు గారు ఆయిల్ పామ్‌లో సంభవించే ప్రధాన పురుగులు, తెగుళ్లు, వాటి లక్షణాలు, సమగ్ర నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు.

హాజరైన అధికారులు, కంపెనీ ప్రతినిధులు

కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ఉద్యాన అధికారులు, కేవీకే ఇన్‌చార్జ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. శ్రీనివాస రాజు గారు, శ్రీ లక్ష్మీ బాలాజీ ఆయిల్ పామ్ company staff, రాధికా వెజిటబుల్ ఆయిల్స్ CEO రాయపు రాజు గారు & staff , శ్రీనివాస oil mills company manager & staff గారు పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సుమారు 150 మంది ఆయిల్ పామ్ రైతులు పాల్గొని, శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష చర్చాగోష్టిలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సుమారు గంటపాటు సాగిన ఈ రైతు-శాస్త్రవేత్తల పరస్పర చర్చ రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. ఈ సందర్భంగా రైతులు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని కోరుతూ నిర్వాహకులకు, శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీకి కేంద్రం బంపర్ నజరానా: 2026-27లో రూ.10,134 కోట్ల రైల్వే బడ్జెట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha