Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అభిమానులకు క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్

అభిమానులకు క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్

వార్త 0 months ago

Vishwak Sen: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మరియు దర్శకుడు విష్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'కల్ట్'. ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్న చిత్ర యూనిట్, అందులో భాగంగా హైదరాబాద్‌లోని ప్రముఖ సారథి స్టూడియోస్‌లో అభిమానుల కోసం ఓ ప్రత్యేకమైన ఫోటో సెషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

భారీగా తరలివచ్చిన అభిమానులు.. అదుపుతప్పిన పరిస్థితి

అయితే, నిర్వాహకుల అంచనాలను తలకిందులు చేస్తూ వేలాది సంఖ్యలో అభిమానులు సారథి స్టూడియోస్‌కు పోటెత్తారు. ఊహించని స్థాయిలో జనం రావడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. తగిన భద్రతా ఏర్పాట్లు లోపించడం మరియు అభిమానుల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని మధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో ఉత్సాహంగా వచ్చిన ఎందరో అభిమానులు హీరోను కలవలేక నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

Vishwak Sen: సోషల్ మీడియా వేదికగా స్పందించిన విష్వక్ సేన్

ఈ అవాంఛనీయ ఘటనపై యంగ్ హీరో విష్వక్ సేన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు తెలియజేశారు. “ఫొటో సెషన్ సమయంలో మీకు తలెత్తిన అసౌకర్యానికి మనస్పూర్తిగా సారీ చెబుతున్నాను. నన్ను కలిసేందుకు, ఫోటో దిగేందుకు వచ్చి అవకాశం దక్కక నిరాశతో వెళ్లిన ప్రతి ఒక్కరినీ పలకరించలేకపోయినందుకు ఎంతో బాధగా ఉంది” అని పేర్కొన్నారు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు అమూల్యమైనవని, త్వరలోనే పటిష్టమైన భద్రతా చర్యలతో, మరింత మెరుగైన ఏర్పాట్లతో మరోసారి ఫ్యాన్ మీట్ నిర్వహిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha