Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Abhishek Sharma: రిస్క్ తీసుకోను టైమింగ్‌పైనే ఆధారపడతా

Abhishek Sharma: రిస్క్ తీసుకోను టైమింగ్‌పైనే ఆధారపడతా

వార్త 4 months ago

నాగ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన టీమిండియా 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. భారత జట్టు ఘన విజయం సాధించడంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కీలక పాత్ర పోషించాడు.

నాగ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు చేసి స్టేడియంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది సిక్సులు, ఐదు ఫోర్లు ఉన్నాయి. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అభిషేక్ శర్మ మాట్లాడుతూ,

ప్రత్యర్థి జట్లు నా కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తాయి

'దూకుడుగా ఆడాలనేది మా జట్టు ప్రణాళికలో భాగం. తొలి రోజు నుంచి మేము అనుసరిస్తున్న వ్యూహం ఇదే. దానినే నేను కొనసాగిస్తున్నాను' అని అభిషేక్ (Abhishek Sharma) స్పష్టం చేశాడు. భారీ సిక్సర్లు కొట్టడంపై మాట్లాడుతూ, '200 స్ట్రైక్ రేట్‌తో ఆడాలంటే తీవ్రంగా సాధన చేయాలి. అంతేకాకుండా అదే ఉద్దేశంతో బరిలోకి దిగాలి. ప్రత్యర్థి జట్లు నా కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి నేను ముందుగానే సిద్ధమవుతాను' అని తెలిపాడు.

తన ఆటలో రిస్క్ ఎక్కువగా ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు.. 'నాకు అలా అనిపించదు. పవర్ ప్లే ఓవర్లను సద్వినియోగం చేసుకోవడమే నా లక్ష్యం. నేను పవర్ హిట్టర్‌ను కాదు, టైమింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడతాను. బంతిని చూసి, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటానికి ప్రయత్నిస్తాను' అని వివరించాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడం కూడా తనకు ఎంతో ఇష్టమని, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ సర్ ఆధ్వర్యంలో కఠోర సాధన చేస్తున్నానని చెప్పాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha