Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ACలో మంటలు చెలరేగి ఏడుగురు దుర్మరణం..ఎక్కడంటే !!

ACలో మంటలు చెలరేగి ఏడుగురు దుర్మరణం..ఎక్కడంటే !!

వార్త 1 week ago

AC : పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తారాపీఠ్ ఆలయ దర్శనార్థం వచ్చిన భక్తులు బస చేసిన ఒక ప్రైవేటు హోటల్లో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఎయిర్ కండిషనర్ (AC) లో సంభవించిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఏసీ నుంచి మొదలైన మంటలు వేగంగా వ్యాపించడమే కాకుండా, హోటల్ గదులనిండా దట్టమైన పొగలు కమ్మేశాయి. దీంతో నిద్రలో ఉన్న భక్తులు బయటకు తప్పించుకోలేక, తీవ్రమైన పొగ వల్ల ఊపిరాడక ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్‌లు: ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోటల్‌లో చిక్కుకున్న పలువురిని సురక్షితంగా వెలికితీసి, తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రశాంతంగా సాగాల్సిన ఆధ్యాత్మిక యాత్రలో ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. హోటల్లో భద్రతా ప్రమాణాలు మరియు విద్యుత్ నిర్వహణపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నారు.

'వందేమాతరం' వివాదం.. సోనియాపై BJP ఫిర్యాదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha