Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'అద్భుతమైన ఆరోగ్యంతో' ట్రంప్: శ్వేతసౌధం వైద్య నివేదిక వెల్లడి!

'అద్భుతమైన ఆరోగ్యంతో' ట్రంప్: శ్వేతసౌధం వైద్య నివేదిక వెల్లడి!

వార్త 2 weeks ago

Trump Health Report: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నారని, దేశ కమాండర్ ఇన్ చీఫ్‌గా తన బాధ్యతలను నిర్వర్తించడానికి ఆయన 'పూర్తిగా ఫిట్‌'గా ఉన్నారని వైట్‌హౌస్ (శ్వేతసౌధం) కీలకమైన వైద్య నివేదికను విడుదల చేసింది.

వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో ట్రంప్‌కు నిర్వహించిన సాధారణ వైద్య పరీక్షల అనంతరం, ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సీన్ బార్బబెల్లా ఈ సమగ్ర నివేదికను అధికారికంగా ప్రకటించారు.

Read Also :Pete Hegseth : భారత్‌పై అమెరికా ప్రశంసలు.. 'పవర్ ఫుల్ కంట్రీ'గా గుర్తింపు

 Donald Trump BMI and Weight

వైద్య పరీక్షల అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' (Truth Social) ద్వారా స్పందిస్తూ, ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగే తన రెగ్యులర్ చెకప్ పూర్తయిందని, నివేదికలన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయని పేర్కొంటూ వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వైద్య పరీక్షల్లో భాగంగా మొత్తం 22 మంది నిపుణులైన వైద్యులు ఆయనకు సీటీ స్కాన్, క్యాన్సర్ స్క్రీనింగ్‌లతో పాటు పలు రకాల అత్యాధునిక పరీక్షలు నిర్వహించారు.

Trump Health Report: బరువు పెరిగినా మేధో సామర్థ్యం అమోఘం

తాజా నివేదిక ప్రకారం ట్రంప్ బరువు 108 కిలోగ్రాములుగా (238 పౌండ్లు) నమోదైంది. గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఆయన బరువు 6 కిలోలు పెరిగారు. ఆయన బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ప్రస్తుతం 29.7గా ఉంది. సాధారణంగా బీఎంఐ 30 దాటితే ఊబకాయం (Obesity) కిందకు వస్తుంది కాబట్టి, ఆయన బరువు తగ్గడానికి ఆహార నియమాలు, శారీరక శ్రమపై వైద్యులు కొన్ని సూచనలు చేశారు.ట్రంప్ మేధోపరమైన, మానసిక సామర్థ్యం అత్యద్భుతంగా ఉందని వైద్యులు తేల్చారు. మేధో సామర్థ్యాన్ని పరీక్షించే 'మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్‌మెంట్‌' (MoCA)లో ట్రంప్ 30 మార్కులకు గానూ 30 పూర్తి మార్కులు సాధించారు. గతంలో 2018, 2025లలో జరిగిన పరీక్షల్లోనూ ఆయన ఇదే స్కోరు సాధించడం విశేషం. సరైన ఔషధాల వాడకం వల్ల ఆయన కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గాయి. 2018లో 223గా ఉన్న టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇప్పుడు 143కి పడిపోయి స్థిరంగా ఉన్నాయి. నిరంతరం ప్రజలతో కరచాలనం (Handshakes) చేయడం వల్ల ఆయన చేతులపై కొన్ని సాధారణ గాయాలు అయ్యాయని, అలాగే కాళ్లలో స్వల్ప వాపు ఉన్నప్పటికీ గతేడాది కంటే ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని నివేదిక పేర్కొంది.

నివేదికకు ఉన్న రాజకీయ ప్రాధాన్యత ఏమిటి?

వచ్చే నెలలో 80వ పడిలోకి (80 ఏళ్లు) అడుగుపెట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్, అమెరికా చరిత్రలోనే అత్యంత ఎక్కువ వయసులో అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. త్వరలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు (Midterm Elections) జరగనున్న తరుణంలో ఈ హెల్త్ రిపోర్ట్ విడుదల కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి ముందు అధ్యక్షుడిగా ఉన్న డెమొక్రాట్ నేత జో బైడెన్, తన వయసు రీత్యా తలెత్తిన శారీరక, మానసిక ఆరోగ్య ఆందోళనల వల్లే 2024 అధ్యక్ష ఎన్నికల రేసు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, ప్రతిపక్షాలు వయసును విమర్శనాస్త్రంగా మార్చుకోకుండా, తన శారీరక మరియు మానసిక దృఢత్వంపై ఎలాంటి సందేహాలకూ తావులేదని అమెరికా ప్రజలకు చాటిచెప్పడానికి ఈ అధికారిక నివేదిక ట్రంప్‌కు రాజకీయంగా పెద్ద ఊరటనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha