Official Language Association: ఒక భాష బోధనాభాషగా, పాలనా భాషగా పత్రికాభాషగా కొనసాగి నప్పుడే అది మనగలుగుతుంది. నేడు తెలుగుభాషకు సంబంధించి చూసి నట్లయితే పత్రికా భాషగా మాత్రమే ముందంజలో ఉందనిపిస్తుంది.
ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలోనే తెలుగు కనిపిస్తుంది, వినిపిస్తుంది. బోధనాభాషగా తెలుగు పరిస్థితి అనిశ్చితంగా ఉంది. ఇక పాలనా భాషగా తెలుగు గురించి మాత్రం చర్చించుకోవలసి ఉంది. ప్రపంచంలోని 7,164 భాషలలో ప్రజలచేత విరివిగా మాట్లాడబడే భాషలలో తెలుగు 14వ స్థానంలో ఉందంటారు. ఇక భారతదేశంలో అత్యధికులు మాట్లాడే హిందీ భాష తరువాత ఒకప్పుడు రెండవస్థానం లో ఉన్న తెలుగుభాష ఇప్పుడు నాల్గవస్థానంలోకి దిగిపో యింది. రెండవ స్థానంలో బెంగాలీ, మూడవస్థానంలో మరాఠీ భాషలు ఉన్నాయి. బ్రిటిష్ పాలనాకాలంలో 1943 నాటి నాణేల మీద ముద్రించిన నాలుగు భాషలలో తెలుగు ఒక భాషగా ఉండేది. 2008లో అక్టోబర్ 31వ తేదీనభారత ప్రభుత్వం తెలుగుభాషకు ప్రాచీన హోదాను ప్రకటించింది. 2012లో ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ తెలుగు లిపిని ప్రపంచంలోనే రెండవ ఉత్తమ లిపిగా గుర్తించింది. మొదటిస్థానంలో కొరియా లిపి నిలిచింది. సమస్త వైజ్ఞానిక, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించగలిగే పద సంపద, సామర్థ్యం తెలుగుభాషకు ఉందని జె.బి.ఎస్. హాల్డెన్ అనే విదేశీ పండితుడు ఏనాడో పేర్కొన్నాడు.
Read Also: Vande Mataram: పాఠశాలల్లో ఉదయం పూట వందేమాతరం ఆలపించడం తప్పనిసరి: బెంగాల్ ప్రభుత్వం
Official Language Association
Official Language Association: ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఆనాడు వైద్య, ఇంజినీరింగ్ కోర్సులు నిజాం పాలనాకాలంలో ఉర్దూ మాధ్యమంలో బోధించబ డ్డాయి. 1948లో పాకిస్థాన్ ప్రభుత్వం అక్కడ ఉర్దూను అధికార భాషగా ప్రకటిస్తే, అత్యధిక ప్రజల మాతృభాష బెంగాలీ అయినందువల్ల, వారంతా ఉర్దూను అధికారభాష గా వ్యతిరేకిస్తూ, బెంగాలీ అధికారభాషగా ప్రకటించాలని పెద్ద ఎత్తున ఉద్యమించి, అందులో నలుగురు విద్యార్థులు ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చి బెంగాలీని అధికార భాషగా ప్రకటించింది. ఒక భాష కోసం ఉద్యమించడం, ఆ భాష ద్వారా ఒక ప్రత్యేక దేశాన్నే సాధించుకోవడం ప్రపంచ చరిత్రలో బంగ్లాదేశానికే సాధ్యమయింది. దాని మేరకేకదా యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం’గా ప్రకటించింది. 1920లో సథామస్ మన్రో మద్రాసు గవర్నర్గా వచ్చినప్పుడు కంపెనీ ఉద్యోగు లందరూ దేశభాషలలోనే ప్రావీణ్యం సంపాదించాలనీ, ప్రజల భాషలతోనే ప్రభుత్వ వ్యవహారాలు కొనసాగించాలని ఆదేశించారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇచ్చారు. వాస్త వానికి తెలుగునాట 19వ శతాబ్దం మధ్య భాగం వరకు తెలుగునే అధికారభాషగా వాడుతుండేవారు. పరిపాలనకు ముందు
తెలుగునేలపై తెలుగే అధికారభాషగా ఉండేది. చరి త్రలోకి వెళితే వేంగీ చాళుక్యులు, రేనాటి చోళులు, కాకతీ యులు, వెలనాటి చోళులు, రెడ్డిరాజులు, రేచర్ల వెలమలు, విజయనగర రాజులు, గజపతులు, కుతుబ్షాహీసుల్తానులు, తమ పాలనా కాలాలలో ఈ తెలుగు గడ్డపైన తెలుగును ప్రోత్సహిస్తూ వచ్చారు.
తెలుగును అధికార భాషగా..
ఆంగ్లేయులు ఆంధ్ర ప్రాంతంలో, నిజాం రాజులు తెలంగాణలో తెలుగుకు తగు ప్రాధాన్యం కల్పించారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత తెలుగు అధికారభాష అయింది. తెలంగాణ విలీనం అనం తరం 1956లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. అప్పుడు తెలుగును అధికార భాషగా అమలు జరపాలని వావిలాల గోపాలకృష్ణయ్య ఇచ్చిన పిలుపు మేరకు 1956 సెప్టెంబర్ 29వ తేదీన కర్నూలులో శాసనసభ ఇందుకు అమోదించింది. తెలుగును అధికారభాషగా నిర్ణయిస్తూ ప్రభుత్వం
1966మే 14న అధి కార భాషాచట్టాన్ని తీసుకొని వచ్చింది. అంటే అధికారభాషా చట్టం వచ్చి సరిగ్గా నేటికి అరవయ్యేళ్ళు అన్నమాట. అంతకు పూర్వమే 1946-47లో అంటే స్వాతంత్ర్యం రాకమునుపే తూర్పుగోదావరి జిల్లాలో, 1950-52లో తెలంగాణలోని తూర్పు ప్రాంతాలలో తెలుగును తాలూకా స్థాయిలో అధి కారభాషగా అమలు చేయడానికి కొంత ప్రయత్నం జరి గింది. అప్పటికే దేశంలోని బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, మద్రాసు, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, సౌరాష్ట్ర, పంజాబ్, అస్సాం తదితర రాష్ట్రాలలో వారు తమ భాష లను అధికార భాషలుగా ప్రకటించుకొని శాసనాలు చేశారు.
అధికారభాషా విభాగం
అధికారభాష అమలుపై కేరళ ప్రభుత్వం ఒక సంఘాన్ని కూడా నియమించింది. ఆంధ్రప్రదేశ్ 1964లో వావిలాల గోపాల కృష్ణయ్య ప్రతిపాదించిన అనధికార బిల్లును తొలుత ప్రజాభిప్రాయానికి, ఆ పైన సెలెక్ట్ కమిటీకి పంపారు. అనం తరం అప్పటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి, విద్యా మంత్రి పి.వి. నరసింహారావు దానికి బదులుగా ప్రభుత్వ బిల్లు తీసుకొని వచ్చారు. దాన్ని శాసనసభ1966 మే 14న ఆమోదించింది. ఆనాటి నుంచి శాసనరీత్యా తెలుగు రాష్ట్రంలో తెలుగు అధికారభాష అయింది. 1973లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖలో ఒక ప్రత్యేకాధికారిని నియమించి, అధికారభాషగా తెలుగు అమలు కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అధికారభాషా శాఖను అప్పటి విద్యా మంత్రి మండలి వెంకటకృష్ణారావుకు అప్పగించింది. 1967 లో పి.వి. నరసింహారావు అధ్యక్షతన ఏర్పడిన సమీక్షా సంఘం 1971లో నివేదికను సమర్పిస్తే, 1974 మార్చి 5వ తేదీన పైన తెలిపిన అధికారభాషా విభాగం ఏర్పడింది.
Official Language Association
భాషా సాహిత్యాల ఉనికి అడుగంటిపోయే ప్రమాదం
1974 మార్చి 19న ప్రభుత్వ ఉత్తర్వు నెం. 199 చట్టం 9వ విభాగం ద్వారా అధికార భాషా కమీషన్ ఏర్పడింది. వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షులుగా, మరో నలుగురు సభ్యులుగా ఈ కమీషన్ పని చేయడం ప్రారంభించింది. అన్ని శాఖలకు చెందిన తాలూకా, అంతకు కిందిస్థాయి కార్యాలయాల్లో శాసనేతరమైన అంశాలకు తెలుగువాడాలని, ఆంగ్లంవాడరాదని ప్రభుత్వం కచ్చితంగా చెప్పింది. 1976లో ఒక అడుగు ముందుకు వేసి జిల్లాస్థాయి కార్యాలయాలకు దీన్ని విస్తరింపజేసింది. 1979లో శాఖాధిపతుల స్థాయి వరకు శాసనేతరమైన అంశాలకు తెలుగును వాడాలని ప్రభు త్వం ఆదేశాలు ఇచ్చింది. 1983 నుంచి దీన్ని సచివాలయ స్థాయిలో ప్రవేశపెట్టారు. 1988 అక్టోబర్ 28న ప్రభుత్వం చట్టపరమైన ఒక ప్రకటనను వెలువరించింది. దాని ప్రకారం శాసనపరమైన అంశాలకూ తెలుగును వాడవలసి ఉంటుంది. అదొక విప్లవాత్మకమైన నిర్ణయం. ప్రజల భాషలో పరిపా లన జరగడమన్నది ప్రజాస్వామ్య పటిష్టతకు,పరిణతికి అత్యంత ఆవశ్యకం. పరిపాలన ఎట్లా, ఏవిధంగా జరుగు తుందో, దాని ఫలితాలను అనుభవించే ప్రజలకు క్షుణ్ణంగా తెలియాలి. వారి ప్రమేయం లేని వారి శ్రద్ధాసక్తులతో మమే కం కాలేని ప్రభుత్వ పరిపాలన నిష్ప్రయోజనం. అధికార భాషా సంఘం పరిధి ప్రభుత్వ కార్యాలయాలలోని పాలనా వ్యవహారాలలో తెలుగు ఎంతవరకు అమలు అవుతోంది. అందుకు తీసుకోవలసిన చర్యలేమిటో ప్రభుత్వానికి సూచించడం వరకే. దానిపై ముందుకు వెళ్ళడం ప్రభుత్వం చేయ వలసిన పని, అక్కడ ఎదురవుతున్న అవరోధాలేమిటో తెలుసుకొని వాటిని అధిగమించడానికి చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అధికారభాషా సంఘం, తెలంగాణ సాహిత్య అకాడమీలకు కొత్త ప్రభుత్వం అధ్యక్షులను నియ మించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ఉదాసీనవైఖరి వల్ల తెలుగు భాషా సాహిత్యాల ఉనికి అడుగంటిపోయే ప్రమాదం ఉంది.. ప్రజల మనోభావాలు గమనించినప్పుడే ప్రభుత్వాలు మనగలుగుతాయి. ప్రతీది ప్రజా ఉద్యమాలు భుజాన వేసుకోవు. భాషాసాంస్కృతిక సంపదను కాపాడు కోవలసిన కర్తవ్యం ప్రజలతోపాటు ప్రభుత్వానిది కూడా.
-ఆచార్య టి. గౌరీశంకర్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

