Dailyhunt
అదిరిపోయిన 'శ్రీనివాస మంగాపురం' టీజర్

అదిరిపోయిన 'శ్రీనివాస మంగాపురం' టీజర్

వార్త 1 week ago

Srinivasa Mangapuram Movie Teaser Release: సూపర్ స్టార్ కృష్ణ లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ సిద్ధమయ్యారు.

ఆయన హీరోగా పరిచయమవుతున్న తొలి చిత్రం 'శ్రీనివాస మంగాపురం' టీజర్ బుధవారం విడుదలైంది. ఈ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Read Also: Mangli case update : మంగ్లీ కేసులో కొత్త ట్విస్ట్

అజయ్ భూపతి మార్క్ యాక్షన్ & లవ్ స్టోరీ

'ఆర్ ఎక్స్ 100', 'మంగళవారం' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ చూస్తుంటే, ప్యూర్ లవ్ స్టోరీతో పాటు పక్కా యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని స్పష్టమవుతోంది."నేను అసలు నీ ఫ్రెండ్ లిస్టులో ఉంటానా?", "మంగ లేకపోతే తిరుపతి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు" వంటి డైలాగ్స్ సినిమాలోని లవ్ ట్రాక్ ఎంత గాఢంగా ఉంటుందో చెబుతున్నాయి.తొలి సినిమా అయినప్పటికీ జయకృష్ణ తన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు.

Srinivasa Mangapuram Movie Teaser Release: గూస్ బంప్స్ తెప్పిస్తున్న మోహన్ బాబు ఎంట్రీ

ఇక ఈ మూవీలో వెంకటరామప్ప నాయుడు అనే పవర్ ఫుల్ పాత్రలో సీనియర్ స్టార్ హీరో మోహన్ బాబు నటిస్తున్నారు. ఈ టీజర్ చివర్లో మోహన్ బాబు ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మొత్తానికి టీజర్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చూస్తుంటే తొలి సినిమాతోనే జయకృష్ణ బ్లాక్ బస్టర్ కొట్టేట్టు కనిపిస్తున్నాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పవన్ పై దారుణమైన కామెంట్స్ చేసిన స్టాండప్ కమెడియన్ అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha