ADMK MLA resign: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో అన్నాడీఎంకే షాక్‌కు గురవుతోంది.
ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు గుడ్‌బై చెప్పగా.. తాజాగా ఇప్పుడు నాలుగో ఎమ్మెల్యే కూడా రాజీనామా చేశారు. అంబసముద్రం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్‌కు లేఖ సమర్పించారు.
Read Also : SC Refuses: గోవధపై సంపూర్ణ నిషేధం:అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ!
Big shock for AIADMK.. another MLA resigns
ADMK MLA resign: వరుస రాజీనామాలు .. మంత్రి ఆదవ్ అర్జునతో భేటీ
ఇటీవలే అన్నాడీఎంకేకు చెందిన కీలక ఎమ్మెల్యేలు మరగాథం, సత్యభామ, జయకుమార్ తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు నేతలు స్పీకర్‌ను నేరుగా కలిసి తమ రాజీనామా లేఖలను అధికారికంగా అందజేశారు. శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వెంటనే, ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు.. సీఎం విజయ్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఆదవ్ అర్జునతో భేటీ అవ్వడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి అర్జున సమక్షంలోనే వీరు త్వరలోనే అధికారికంగా టీవీకే (TVK) కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు నియోజకవర్గం/పార్టీ వివరాలు
ఎసాక్కీ సుబాయా అంబసముద్రం (తాజా రాజీనామా), మరగాథం మాజీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే, సత్యభామ మాజీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే, జయకుమార్ మాజీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

