Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Afghanistan: పాక్ మెడిసిన్ వద్దు భారత్ మందులపై మొగ్గు..ఎందుకంటే?

Afghanistan: పాక్ మెడిసిన్ వద్దు భారత్ మందులపై మొగ్గు..ఎందుకంటే?

వార్త 5 months ago

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) మధ్య దూరం పెరుగుతోంది. రీసెంట్ గా రెండు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఆఫ్ఘాన్…పాకిస్తాన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించకుంది.

తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి దిగుమతి అవుతున్న ఔషధాలపై నిషేధం విధించింది. దీని స్థానంలో భారతీయ మందులను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన ఓ చిన్న కొనుగోలు అక్కడ పెద్ద దుమారమే రేపింది. ఏకంగా ఒక దేశంతో వాణిజ్యాన్ని నిషేధించే వరకు చేరుకుంది. రీసెంట్ గా ఆఫ్ఘనిస్థాన్ ఓ ఓ వ్యక్తి పారాసిటమాల్ కు సంబంధించిన పరోల్ ను కొనుక్కున్నాడు. ఈ మందులను ఆఫ్ఘాన్ కు పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి. అయితే ఆ వ్యక్తి మందులు కొంటున్న ఫార్మాసిస్ట్ అతనికి భారత్ నుంచి వచ్చిన టాబ్లెట్ లను తీసుకోమని సూచించారు. పాక్ మందుల కంటే భారత్ టాబ్లెట్లు నాలుగు రెట్లు చౌకగా వస్తాయని చెప్పారు. నాణ్యత కూడా ఎక్కువని తెలిపారు.

కాబుల్ కు భారత్ సహాయం..

ఆఫ్ఘాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆలోచనలో ఉంది. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఔఫధాల నాణ్యత తక్కువగా ఉందని..ఆఫ్ఘనిస్తాన్ ఉప ప్రధాన మంత్రి అబ్దుల్ ఘనీ బరదార్ చెబుతూనే ఉన్నారు. వాటికి ప్రత్యామ్నాయాలు వెతకాలని వ్యాపారులను కోరారు. ఈ క్రమంలో భారత్ నుంచి మందులు వారిని ఆకర్షించాయి. దీంతో పాకిస్తాన్ తో ఔషదాల వాణిజ్యాన్ని నిషేధించి..భారత్ కొనసాగించాలని ఆఫ్ఘనిస్థాన్ నిర్ణయించింది. ఇప్పటికే న్యూఢిల్లీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాబూల్‌కు $108 మిలియన్ల విలువైన మందులను పంపిందని.. 2025 మిగిలిన కాలంలో $100 మిలియన్ల విలువైన ఎగుమతులు జరుగుతాయని నివేదికలు సూచిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Budget 2026: సామాన్యుడి జీవితంలోకి ఏఐ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha