Agni 4 : భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) వ్యూహాత్మక క్షిపణి సామర్థ్యంలో మరో అద్భుతమైన మైలురాయిని సాధించింది. మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి 'అగ్ని-4' (Agni-IV) ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది.
ఒడిశా తీరంలోని చండీపూర్ సమీపంలో ఉన్న అబ్దుల్ కలాం ఐలాండ్ ప్రయోగ వేదిక నుంచి ఈ పరీక్షను నిర్వహించినట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రయోగ సమయంలో క్షిపణి తన ప్రయాణ మార్గంలో నిర్దేశించుకున్న అన్ని సాంకేతిక పారామితులను, ప్రమాణాలను అత్యంత ఖచ్చితత్వంతో చేరుకుందని, ఈ ప్రయోగం పూర్తి విజయాన్ని సాధించిందని రక్షణ రంగాధిపతులు వెల్లడించారు.

4,000 కిలోమీటర్ల లక్ష్య ఛేదన: మరింత పటిష్టంగా భారత రక్షణ వ్యవస్థ
సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం ఈ ‘అగ్ని-4’ క్షిపణికి ఉంది. ఆధునిక ఏవియానిక్స్, అధునాతన నేవిగేషన్ సిస్టమ్స్ మరియు సుదూర లక్ష్యాలను కూడా సులభంగా తాకేలా రూపొందించిన ఈ రక్షణ వ్యవస్థ సైన్యంలో మరింత పటిష్టతను చేకూర్చనుంది. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ క్షిపణి విజయవంతమైన పరీక్షతో భారత రక్షణ దళాల విశ్వసనీయత మరియు నిరోధక సామర్థ్యం మరింత రెట్టింపయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దుల్లో వ్యూహాత్మక సమతుల్యతను కాపాడుకోవడంలో ఈ విజయం భారత్‌కు ఎంతో కీలకమైనది.
రైతుల కోసం కేంద్రం భారీ నిర్ణయం.. రూ.23,731 కోట్ల 'గోబర్‌ధన్' పథకం!

