Dailyhunt
AI 1 Pay: ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్

AI 1 Pay: ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్

వార్త 3 months ago

డిజిటల్ బ్యాంకింగ్‌ను మరింత సులభతరం చేసే దిశగా కెనరా బ్యాంక్ (Canara Bank) మరో కీలక అడుగు వేసింది. ఏఐ ఆధారిత స్మార్ట్ ఫీచర్లతో కూడిన నూతన యూపీఐ యాప్‌ను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

'కెనరా ఏఐ 1పే' (AI 1 Pay) పేరుతో ప్రారంభించిన ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.

Battery Energy: వినియోగంలోకి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ విద్యుత్ సాంకేతికత!

డిజిటల్ చెల్లింపులు

ఇప్పటికే ఇతర యూపీఐ యాప్‌లలో రిజిస్టర్ అయిన కెనరా బ్యాంక్ ఖాతాదారులు సైతం సులభంగా మార్చుకోవచ్చు. కెనరా ఏఐ 1పే (AI 1 Pay) పేరుతో కొత్త యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ఏ బ్యాంకు ఖాతానైనా లింక్ చేసుకొని వేగంగా, సురక్షితంగా డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు.

వ్యక్తిగత వినియోగదారులతో పాటు వ్యాపారులు, చిన్న దుకాణాలు, స్వయం ఉపాధి వ్యక్తులు సైతం సులభంగా చెల్లింపులు స్వీకరించేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఫీచర్ల విషయానికి వస్తే, నెలవారీ ఖర్చుల విశ్లేషణ, కేటగిరీల వారీగా వివరాలు, ఆర్థిక ట్రెండ్స్ వంటి ఆర్థిక నిర్వహణకు సహాయపడుతుంది.హోమ్ స్క్రీన్ లోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి త్వరగా చెల్లింపులు జరపవచ్చు. చిన్న మొత్తాలను చెల్లించేందుకు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.

బిల్లులు, సబ్ స్క్రిప్షన్లు, ఈఎంఐలు, ఎస్ఐపీల ఆటోమెటిక్ చెల్లింపులు కూడా చేసుకోవచ్చు.భద్రత విషయానికి వస్తే బయోమెట్రిక్ లాగిన్, డివైజ్ బైండింగ్ (రిజిస్టర్ మొబైల్ నుంచి మాత్రమే లావాదేవీలు) వంటి మల్టీ లెవెల్ సెక్యూరిటీ అందుబాటులో ఉంది. అంతేకాకుండా అనుమానాస్పద లావాదేవీలను తక్షణం గుర్తించి హెచ్చరికలు చేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Gold rate news : డిసెంబర్ 24 బంగారం ధరలు.. 24K గోల్డ్ కొత్త రికార్డు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha