Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐదు భాషల్లో సినిమాలతో లేడీ సూపర్ స్టార్ బిజీ బిజీ

ఐదు భాషల్లో సినిమాలతో లేడీ సూపర్ స్టార్ బిజీ బిజీ

వార్త 2 months ago

Nayanthara: దక్షిణాది సినీ పరిశ్రమలో 'లేడీ సూపర్ స్టార్' నయనతార, ఇప్పుడు ఏకంగా ఐదు భాషల్లో సినిమాలు చేస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో తన హవా కొనసాగిస్తున్నారు.

మలయాళంలో మొదలైన ఆమె ప్రయాణం, ఇప్పుడు బాలీవుడ్ వరకు చేరింది.

నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. 2003లో మలయాళ చిత్రం 'మనసీనక్కరే'తో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, అతి తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు.

'అయ్యా' సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టి, అక్కడ 'లేడీ సూపర్ స్టార్' అనే బిరుదును సంపాదించుకున్నారు.షారుఖ్ ఖాన్ సరసన 'జవాన్' సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించి, మొదటి సినిమాతోనే అక్కడ భారీ క్రేజ్ సంపాదించారు.

నయనతార కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ మెప్పించారు.2011లో వచ్చిన 'శ్రీరామరాజ్యం' సినిమాలో సీతగా ఆమె నటనకు ఫిలింఫేర్ అవార్డు లభించింది.

క్రైస్తవ కుటుంబంలో జన్మించిన నయనతార, 2011లో హిందూ మతాన్ని స్వీకరించారు.సుదీర్ఘ కాలం ప్రేమలో ఉన్న తర్వాత, 2022లో దర్శకుడు విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం నయనతార ఏకకాలంలో ఐదు భాషల్లో నటిస్తున్నారు.తెలుగు తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.. అలాగే మలయాళంలోనూ సినిమాలు చేస్తుంది. ఇప్పటికే రెండు సినిమాలను లైనప్ చేసింది. ఇక ఇప్పుడు కన్నడ భాషలోనూ నటిస్తుంది. ఇలా ఐదు భాషల్లో నటిస్తూ యమా బిజీగా ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha