Dailyhunt
ఐదు మ్యాచ్‌లు.. సున్నా వికెట్లు: బుమ్రా పై ముంబై ఇండియన్స్ ఆందోళన

ఐదు మ్యాచ్‌లు.. సున్నా వికెట్లు: బుమ్రా పై ముంబై ఇండియన్స్ ఆందోళన

వార్త 5 days ago

Jasprit Bumrah: ప్రపంచ అత్యుత్తమ పేసర్, ముంబై ఇండియన్స్ వెన్నుముక జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2026 సీజన్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో వణుకు పుట్టించే బుమ్రా, ప్రస్తుత టోర్నీలో వికెట్లు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తుండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇప్పటివరకు ముంబై ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక బుమ్రా తన కెరీర్‌లోనే అత్యంత పేలవమైన ప్రదర్శనను కనబరుస్తున్నాడు. తన ప్రాణాంతక యార్కర్లు, స్లోయర్ బంతులతో వికెట్లు తీసే బుమ్రా ఈసారి పూర్తిగా నిరాశపరుస్తున్నాడు.

Read Also:Vinod Kambli: చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు

Jasprit Bumrah: వాంఖెడేలోనూ దక్కని వికెట్: వరుస ఓటముల్లో ముంబై

 Mumbai Indians suffer four consecutive defeats in the IPL.

గురువారం సొంత మైదానమైన వాంఖెడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులోనైనా బుమ్రా ఫామ్‌లోకి వస్తాడని అందరూ ఆశించారు. కానీ, ఈ మ్యాచ్‌లోనూ బుమ్రా 4 ఓవర్ల కోటాలో 41 పరుగులు ధారబోసి ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ప్రస్తుత సీజన్‌లో అతని ఎకానమీ రేట్ 8.63గా నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జట్టు ప్రధాన బౌలర్ ఇలా విఫలమవ్వడం ముంబై ఇండియన్స్‌పై గట్టి ప్రభావం చూపుతోంది. టోర్నీలో ఘనంగా బోణీ కొట్టిన ముంబై, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలై పాయింట్ల పట్టికలో వెనుకబడింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే బుమ్రా తన పాత లయను అందుకోవడం ముంబైకి ఇప్పుడు అత్యంత కీలకం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

శ్రేయస్ అయ్యర్ సూపర్ మ్యాన్ ఫీల్డింగ్.. నోరెళ్ల బెట్టిన సూర్యకుమార్, రోహిత్ శర్మ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha